పిల్లలు కళ్ల ముందే ఎదిగిపోతుంటారు. చూస్తుండగానే ఎల్‌కేజీ.. యూకేజీ అంటూ బుడి బుడి అడుగులు వేస్తూ.. కాలేజీకి.. ప్రొఫెషనల్ కోర్సులకు వచ్చేస్తుంటారు. వారికి ఆ స్థాయికి వచ్చేసరికి మన వయస్సు.. యవ్వనాన్ని ధాటి వృద్ధాప్యం దిశగా సాగుతుంటది. పిల్లల్ని మంచిగా చదివిద్దామా ! అంటే.. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే.. పోనీ, ఉద్యోగం చేద్దామా అంటే.. వయస్సు సహకరించదు. ఆరోజు.. మీ దగ్గర డబ్బులు లేక మీ పిల్లలకి మంచి అవకాశాలను ఇప్పించలేకపోయామే అని బాధపడే రోజులు రాకుండా ఉండాలంటే.. ఇప్పటినుంచే వెనకేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా.. పొదుపు చేసిన డబ్బులు.. వారి చుదువులకు, పెళ్లిళ్లకే కాదు.. వృద్ధాప్యంలో మనకు ఆర్థిక భరోసాగా కూడా ఉంటాయి.
చాలా మందికి పొదుపు చేసే ఆలోచనలు ఉంటాయి. కానీ, ఎందులో పొదుపు చేయాలి? మన డబ్బులు తిరిగొస్తాయా? సరైన టైంలో డబ్బులిస్తారా? ఇవ్వరా?.. ఇలాంటి లెక్కలేనన్ని సందేహాలు మదిలో మెదులుతుంటాయి. వీటన్నిటికీ చక్కటి పరిష్కారం చూపే దిశగా మేం ప్రయత్నిస్తాం.. పిల్లల భవిష్యత్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు రెండు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలున్నాయి. వాటిలో ఒకటి సుకన్య సమృద్ధి యోజన అయితే.. మరొకటి చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ రెండు స్కీమ్స్‌లో ఏది బెటర్, దేనిలో డబ్బులు పెడితే మెచ్యూరిటీ సమయానికి మంచి డబ్బులొస్తాయో అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సుకన్య సమృద్ధి యోజన:
బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం కింద కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకం ‘బాలికల’ బంగారు భవితకు భరోసా అని చెప్పొచ్చు. పొదుపు పథకాలపై బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల కన్నా సుకన్య సమద్ధి యోజన అందించే వడ్డీ రేటు చాలా ఎక్కువ. పుట్టిన శిశువు నుంచి పదేళ్లు వచ్చేంత వరకు తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను తెరవవచ్చు.
ప్రయోజనాలు:
ఈ స్కీమ్ మెచ్యూరిటీ టైమ్ 21 సంవత్సరాలు. 15 ఏళ్ల పాటు ఇందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆడపిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత వారి చదువుల కోసం.. అవుట్ స్టాండింగ్ మొత్తం నుంచి 50 శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు అయినప్పటికీ.. ఆఢపిల్ల వివాహం 18 ఏళ్లు నిండిన తర్వాత చేస్తే ఆ ఖాతాను మూసివేయవచ్చు. ఎస్ఎస్‌వై పెట్టుబడులకు పన్ను ఉండదు. సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
పరిమితులు:
ఎస్ఎస్‌వై స్కీం.. ప్రత్యేకించి ఆడపిల్లల సంక్షేమం కోసమే తీసుకొచ్చిన పథకం. ఒకవేళ అబ్బాయి అయితే తల్లిదండ్రులు మరో పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. వడ్డీ రేట్లను ప్రతి క్వార్టర్‌లో సమీక్షిస్తూ ఉంటారు. కొన్ని సార్లు రేట్లలో కోత కూడా ఉంటుంది. అలా కోత పడ్డప్పుడు.. మెచ్యూరిటీ మొత్తం కూడా తగ్గుతుంది. ఒకవేళ తల్లిదండ్రులు అనుకోని ప్రమాదం వల్ల మరణిస్తే.. ఎస్ఎస్‌వై అకౌంట్లకు పెట్టబడులు ఆగిపోతాయి. ఏ అవసరం కోసమైతే ఇందులో డబ్బులు పెడుతున్నామో ఆ అవసరం నెరవేరకుండా పోతుంది.
Sukanya Samriddhi Yojana is ensuring a bright future for young girls. https://t.co/HDwI3mZq9C #TransformingIndia #BetiBachaoBetiPadhao #NationalGirlChildDay pic.twitter.com/1Cd7oTi5v9
— MyGovIndia (@mygovindia) January 24, 2019
చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్:
సుకన్య సమృద్ధి యోజన మాదిరిగానే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా పిల్లల పెళ్లిళ్లకు, చదువుల అవసరాల కోసం ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఉంటాయి. అంతేకాదు.. ఈ ఇన్సూరెన్సులు బాలికలు, బాలురు ఇరువురు తీసుకోవచ్చు.
ప్రయోజనాలు:
చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో అనుకోని ప్రమాదం వల్ల తల్లిదండ్రులు మరణిస్తే.. ప్రీమియం చెల్లించాల్సినవసరం లేకుండా పాలసీ కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మినహాయింపు ప్రయోజనం ఆప్షన్ ఉంటుంది. మెచ్యూరిటీని తల్లిదండ్రులు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. కొన్ని సార్లు మనీ బ్యాక్ పాలసీ కూడా అందుబాటులో ఉంటుంది. ఎస్ఎస్‌వై లాగానే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలున్నాయి. మెచ్యూరిటీ, మనీ బ్యాక్ కూడా పన్ను రహితం
పరిమితులు:
ఈ ప్లాన్లలో అధికం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ బోనస్ రేటుతో, ఎక్కువ సమ్ అస్యూర్డ్ ప్లాన్లను తీసుకోవాల్సి ఉంటుంది.
Child insurance plans specifically provide for your child’s future even in your absence. #Growth #educationplanning #education pic.twitter.com/9LK9GWCfHz
— Rekha Manoj C (@rekhamanojc) October 16, 2019
మీరు.. అమ్మాయి గురుంచి ఆలోచిస్తున్నట్లయితే.. సుకన్య సమృద్ధి యోజన ఉత్తమం. ఇందులో ఆకర్షణీయమైన రాబడితో పాటు పూర్తిగా పన్ను ప్రయోజనాలు ఉంటాయి. అలాగే.. ఖరీదైన చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను మాత్రమే కాకుండా.. చౌకగా లభించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా ఎంపిక చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాలను మ్యూచువల్ ఫండ్(సిప్)లో పెట్టుబడిగా పెట్టొచ్చు.
గమనిక: ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎందులో పెట్టుబడి పెట్టాలి అన్నది.. తల్లిదండ్రుల తుది నిర్ణయమే. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ravindra Jadeja: జడేజా భార్య గొప్ప మనసును ప్రశంసించిన ప్రధాని మోదీ!
ఇదీ చదవండి: బిజినెస్ చేయాలనుకునే వారికి కోటి రుపాయల వరకు SBI రుణాలు!