చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పొదుపు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షల మంది ప్రజలు లబ్ధిపొందనున్నారు.
చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించింది. వడ్డీ రేట్లను 70 బేసిక్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల వడ్డీ రేట్లు మారనున్నాయి. మరోవైపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సాధారణ సేవింగ్స్ డిపాజిట్ వడ్డీ రేట్లలో ఎలాంటి సవరణలు చేయలేదు. మునుపటి వడ్డీ రేట్లు యధాతధంగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
చిన్న మొత్తాల పొదుపు పథకాలైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సి), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సిఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర (కేవీపి), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సవరణలు చేస్తుంది. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికంలో మార్పులు చేసింది. సవరించిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..