ఎస్బీఐ వాట్సప్ ద్వారా సర్వీసులు అందించనుంది. మెసేజ్ యాప్‌లలో వాట్సాప్ పబ్లిక్ కు బాగా కనెక్ట్ అయింది. ప్రతి చిన్న విషయాన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అలాగే బ్యాంకులు కూడా వాట్సాప్ ద్వారా సేవలను అందించనున్నాయి. వినియోగదారులకు సేవలు అందించుటలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉంది.
మనం నిత్యం ఏదో ఒక వస్తువు కొంటాం. ద్రవ్యం చెల్లించే రోజులు పోయి డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టాం. మనం నిత్యం బ్యాంక్ సేవలను వినియోగించుకుంటున్నాం. రోజురోజుకి ప్రజలకు అనుగుణంగా కొత్తపుంతలు తొక్కుతుంది. వినియోగదారులకు సర్వీసులను అందించడంలో డిజిటల్ ఫీచర్స్‌తో మన ముందుకు వస్తుంది. తాజాగా ఎస్బీఐ వాట్సప్ ద్వారా సర్వీసులు అందించనుంది. మెసేజ్ యాప్‌లలో వాట్సాప్ పబ్లిక్ కు బాగా కనెక్ట్ అయింది. ప్రతి చిన్న విషయాన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అలాగే బ్యాంకులు కూడా వాట్సాప్ ద్వారా సేవలను అందించనున్నాయి. వినియోగదారులకు సేవలు అందించుటలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉంది. వినియోగదారులకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మినీ స్టేట్ మెంట్ తీసుకోవడం వంటివి ఇక వాట్సాప్ ద్వారా పొందవచ్చు. అందుకోసం వినయోగదారులు తెలుసుకోవాల్సిన విషయాలేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్..
ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సోల్ ప్రొప్రైటర్స్ సీసీ ఓడీ అకౌంట్ హోల్డర్లు కూడా బుక్ బ్యాలెన్స్, అకౌంట్, రెన్యూవల్ డేట్, స్టాక్ స్టేట్మెంట్ ఎక్స్‌పైరీ డేట్ వంటివి తెలుసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్ సర్వీస్, లోన్ ఉత్పత్తులపై సమాచారం తెలుసుకోవచ్చు. గృహ రుణం, కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ గురించి వడ్డీ రేట్లు మొదలైన అంశాలను తెలుసుకోవచ్చు. డిపాజిట్ కి సంబంధించిన సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్లు, వడ్డీ రేట్ల సమాచారం పొందవచ్చు. ఎన్ఆర్ఐ సేవలు ఫీచర్లు, వడ్డీ రేట్లు మొదలైన అంశాలపై సమాచారం తెలుసుకోవచ్చు. వ్యక్తిగత లోన్, కార్ లోన్, టూ వీలర్ లోన్, డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసుల సమాచారం, హాలిడే క్యాలెండర్, డెబిట్ కార్డ్ వినియోగంపై పూర్తి సమాచారం, లాస్ట్.. స్టోలెన్ కార్డ్ గురించి సమాచారం తెలియపరుస్తారు. సమీప ఏటీఎం లేదా బ్రాంచ్ లొకేటర్ గురించి తెలుసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?
ఎస్బీఐ ఖాతాలో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి “WAREG ACCOUNT NUMBER” అని టైప్ చేసి +917208933148కు SMS Send చేయాలి. ఒకవేళ మీ అకౌంట్ నంబర్ 12345678 అయితే WAREG12345678 అని టైప్ చేసి +917208933148కు Send చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ వాట్సాప్ లింకైన నెంబర్ కు Conformation message వస్తుంది. ఆ తర్వాత మీ వాట్సాప్ నంబర్ నుండి Hi అని +919022690226 నంబర్ కు మెసేజ్ పెట్టాలి.
ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాదారులు, కరెంట్ అకౌంట్, ఎన్ఆర్ఐ అకౌంట్స్, సీసీ ఓడీ అకౌంట్స్ ప్రొప్రైటర్స్ మాత్రమే ఎస్బీఐ సేవలను వాట్సాప్ ద్వారా పొందుతారు.