Record Breaking Salary : పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలకు భారీ మొత్తంలో జీతాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి వాటి సీఈఓలకు సంవత్సరానికి వందల కోట్లలో జీతం ఉంటుంది. వీటినే కళ్లు బైర్లు కమ్మే జీతాలు అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ, బ్లాక్ స్టోన్ ఇంక్‌కు చెందిన సీఈఓ జీతం గురించి తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. బ్లాక్‌స్టోన్ సీఈఓ స్టీఫెన్ స్కార్జ్మాన్ 2021 సంవత్సరానికి గానూ 1.1 బిలియన్ డాలర్లను తీసుకున్నాడు. దాన్ని ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 8,500 కోట్ల రూపాయలన్న మాట.
డివిడెంట్లు, ఇతర పరిహారాల రూపంలో ఈ మొత్తం లభించింది. స్టీఫెన్ ఈ మొత్తంలో శాలరీ తీసుకోవటం ఇదే మొదటిసారి. వాల్‌స్ట్రీట్‌లో ఇంత పెద్ద మొత్తంలో జీతం తీసుకోవటం ఇదే రికార్డు. న్యూయార్క్‌కు చెందిన బ్లాక్స్టోర్ కంపెనీలో స్టీఫెన్‌కు 19 శాతం వాటాలున్నాయి. ఈ వాటాల నుంచి పొందిన డివిడెంట్ల ద్వారా స్టీఫెన్ 2021లో 941.6 మిలియన్ డాలర్లను పొందారు. దానితో పాటు 160.3 మిలియన్ డాలర్ల పరిహారాలను కూడా పొందారు. 1985లో ఏర్పాటైన ఈ కంపెనీకి స్టీఫెన్ సహ వ్యవస్థాపకుడు కూడా. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.