గత కొద్ది కాలంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమైన మూలధనం, ఆదాయాలను సమకూర్చుకోలేని బ్యాంక్ లపై కొరడా ఝళిపిస్తోన్న సంగతి మనకు తెలిసిందే. మెున్నటికి మెున్న మహారాష్ర్టకు చెందిన లక్ష్మీ కో-ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసిన విషయం మనందరికి తెలిసిందే. తాజాగా మరో బ్యాంక్ విషయంలో కూడా ఆర్బీఐ ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. డిపాజిటర్లను ప్రమాదంలో పడేస్తున్న బ్యాంక్ ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని గతంలోనే చెప్పిన ఆర్బీఐ అన్నంత పని చేస్తోంది. తాజాగా మరో బ్యాంక్ కు చెందిన లైసెన్స్ ను శుక్రవారం రద్దు చేసినట్లుగా ప్రకటించింది. దాంతో ఆ బ్యాంక్ ఖాతాదారులు ఆందోళన పడుతున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
డిపాజిటర్లను ప్రమాదంలోకి నెట్టేస్తున్న బ్యాంకుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది ఆర్బీఐ. కొన్ని రోజుల క్రితమే మహారాష్ట్రకు చెందిన లక్ష్మీ కోపరేటీవ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసి మూసి వేయించిన ఆర్బీఐ.. తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసింది. బ్యాంక్ నడవడానికి అవసరమైన మూలధనాన్ని, ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో విఫలం అయిన మహారాష్ట్రకు చెందిన బాబాజీ డేట్ మహిళా కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ తెలిపింది. ఈ క్రమంలోనే 79 శాతం మంది ఖాతాదారులకు తమ తమ డబ్బు పూర్తిగా వస్తుందని తెలిపింది.
The RBI Friday cancelled the licence of Maharashtra-based Babaji Date Mahila Sahakari Bank Limited in Yavatmal, citing that the lender did not have adequate capital and earning prospects.
Read:https://t.co/I3oytQNQzY— The Indian Express (@IndianExpress) November 11, 2022
ఈ క్రమంలో ఈ మెుత్తాన్ని వారు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్(DICGE) నుంచి పొందవచ్చని తెలిపింది. అక్టోబర్ 16 వరకు ఉన్న డేటా ప్రకారం ఇన్సూర్డ్ డిపాజిట్లలో రూ. 294 కోట్లను చెల్లించింది. బాబాజీ డేట్ మహిళా కోపరేటివ్ లిమిటెడ్ బ్యాంక్ పరిస్థితి ప్రస్తుతం ఏం బాగోలేదు. ప్రస్తుతం ఉన్న డిపాజిటర్లకు కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉంది. అందుకే దీని లైసెన్స్ రద్దు చేశామని ఆర్బీఐ తెలిపింది. ఈ బ్యాంక్ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి డిపాజిట్లు వారికి సురక్షితంగా అందిస్తామని RBI స్పష్టం చేసింది.
#RBI imposes several restrictions on Maharashtra-based Babaji Date Mahila Sahakari Bank, including capping withdrawals at 5,000 rupees for customers, amid deterioration in the lender’s financial position. The restrictions will remain in force for six months. pic.twitter.com/xARWP7Pw3r
— All India Radio News (@airnewsalerts) November 10, 2021