సాధారణంగా బ్యాంక్ నుంచి లోన్ పొందడం అంటే.. ఎంత కష్టమో.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొవాలో.. చాలా మందికి అనుభవమే. లోన్ శాంక్షన్ చేయడం కోసం.. అధికారులు.. నెలల తరబడి.. బ్యాంక్‌ల వెంట తిప్పుకుంటారు. డాక్యుమెంట్స్, కాగితాలు అంటూ.. చాలా హడావుడి చేస్తారు. చదువుకున్న వాళ్లకే బ్యాంక్ రూల్స్ సరిగా అర్థం కావు.. అధికారులతో మాట్లాడాలంటే.. ఇబ్బంది పడతారు. అలాంటిది ఇక మిగతా వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాలా. అందుకే ఈ ఇబ్బందులు పడలేక.. చాలా మంది మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి.. పనులు చేయించుకుంటారు. ఇక మన దేశంలో అన్నదాతలకు లోన్ లభించడం మరింత కష్టం. రైతులంటేనే చిన్న చూపు చూసే అధికారులు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో ఓ బ్యాంక్ మాత్రం.. ఒక్క మిస్డ్ కాల్‌తో రైతులకు లోన్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..
ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. అన్నదాతలకు శుభవార్త చెప్పింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. రైతులకు మరింత సులభంగా.. రుణాలు అందించేందుకు రెడీ అవుతోంది. కేవలం ఒక్క మిస్డ్ కాల్ ద్వారా.. రైతులు లోన్ పొందవచ్చని చెబుతోంది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది బ్యాంక్. లోన్ కావాలనుకునే రైతులు.. బ్యాంకుకు వెళ్లే పని లేకుండా.. వివిధ మార్గాల్లో.. లోన్ కోసం అప్లై చేయవచ్చు అని తెలిపింది.
ఇందుకోసం.. ఎస్ఎంఎస్ పంపండం, లేదంటే బ్యాంక్ ఏర్పాటు చేసిన నంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వడం, నెట్ బ్యాంకింగ్, పీఎన్బీ వన్ వంటి వాటి ద్వారా.. అన్నదాతలు నేరుగా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. పైన చెప్పిన మార్గాల్లో లోన్ కోసం దరఖాస్తు చేయడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందా. ఎస్ఎంఎస్ పద్దతిలో అయితే.. లోన్ అని టైప్ చేసి 56070 అనే నెంబర్‌కు మెసేజ్ చేయాలి. మిస్డ్ కాల్ ద్వారా అంటే.. 18001805555 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. అలాగే 18001802222 అనే కాల్ సెంటర్ నెంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు.
ఈ ఆప్షన్లు కాకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా రైతులు లోన్‌కు అప్లై చేసుకోవచ్చు. లేదంటే.. బ్యాంక్ వినియోగదారుల కోసం.. పీఎన్బీ వన్ అనే యాప్‌ను కూడా బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. లోన్ కావాలనుకునేవారు ఈ యాప్‌లోకి లాగిన్ అయ్యి.. రుణం కోసం అప్లై చేయవచ్చు. అయితే అర్హత కలిగిన బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయని గుర్తించుకోవాలి. మీరు అర్హులయితే.. మిగతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మరి పీఎన్బీ తీసుకువచ్చిన ఈ సదుపాయం వల్ల రైతులకు ప్రయోజనం ఉంటుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
कैसे करते हैं कृषि ऋण के लिए आवेदन? जाने हमारे यूट्यूब चैनल पर!
आज ही सब्सक्राइब करें:https://t.co/K7xY2L2dyU #agriculture pic.twitter.com/xWpnWrI7ZU— Punjab National Bank (@pnbindia) December 23, 2022