కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తోన్న పీఎం కిసాన్ 13వ విడత డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఈ నిధులను విడుదల చేశారు. అర్హులైన 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్లు జమ చేశారు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. అదెలా అన్నది కింద సమాచారాన్ని చదవండి.
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం కిసాన్ సమ్మాన్ యోజన‘ 13 విడత డబ్బులను ప్రధాని నరేంద్ర మోడీ నేడు విడుదల చేశారు. సోమవారం కర్ణాటకలోని బెలగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ నిధులను విడుదల చేశారు. అర్హులైన 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్లు జమ చేశారు. ఎవరైతే ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేశారో వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.
రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశ్యంతో 2019లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో ఏడాదిలో మూడు దఫాలుగా రూ.6వేలు జమ చేస్తుంటుంది. ఒక్కో విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున జమ అవుతాయి. కేంద్రం ఇప్పటిదాకా ఈ పథకం కింద 12 విడతలుగా నిధులను విడుదల చేసింది. అంటే దాదాపు రూ. 24 వేలు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. కింది విధానాన్ని అనుసరించి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
గమనిక: ఎవరైతే ఇకేవైసీ చేసుకోలేదో.. వారికి డబ్బులు రాకపోవచ్చు. అందువల్ల అన్నదాతలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇప్పటికీ ఈకైవేసీ చేసుకోని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్ కు వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు ఉంటే పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబరు 155261 / 011-24300606కు కాల్ చేయొచ్చు.