హైదరాబాద్ శివారులో ఓపెన్ ప్లాట్లు రూ. 9 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదేమో.
భవిష్యత్తులో మీరు ఉండడం కోసమైనా లేదా పెట్టుబడి పెట్టి మంచి లాభాలు పొందడం కోసమైనా గానీ హైదరాబాద్ శివారులో ఉన్న ఈ ఏరియా చాలా ఉత్తమం అని చెప్పవచ్చు. పెట్టుబడి పెట్టేవారికి పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ చాలా తక్కువ బడ్జెట్ లో అందుబాటులో ఉన్నాయి. డీటీసీపీ, రెరా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ ని గజం రూ. 6 వేల చొప్పున విక్రయిస్తున్నారు. యాక్చువల్ గా గజం రూ. 7500 ఉంది. ప్రస్తుతం ఆఫర్ నడుస్తోంది. గజం మీద రూ. 1500 తగ్గింపు ఇస్తున్నారు. మామూలుగా 150 గజాల ప్లాట్ కొనాలంటే రూ. 11,25,000 అవుతుంది. అదే ఆఫర్ లో కొనుగోలు చేస్తే రూ. 9 లక్షలు అవుతుంది. రూ. 2,25,000 ఆదా అవుతుంది.
ఇదే ముంబై హైవేలో గజం రూ. 12 వేలు నుంచి రూ. 20 వేలు రేంజ్ లో ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అయితే సదాశివపేటకు దగ్గరలో ముంబై హైవే మీద తక్కువ బడ్జెట్ లో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. సదాశివపేటలో ప్లాట్ కొనాలంటే గజానికి రూ. 14,850 అవుతుంది. ఇందులో సగానికి పైగా ధరకు ఈ ఏరియాకి దగ్గరలో ప్లాట్ వచ్చేస్తుంది. 150 గజాలు అంటే తక్కువ స్థలం ఏమీ కాదు. 1350 చదరపు అడుగులు. ఈ స్పేస్ లో విశాలమైన 2 బీహెచ్కే ఇల్లు కట్టుకోవచ్చు. లేదంటే మంచి లాభానికి అమ్ముకోవచ్చు. హైదరాబాద్ లో ల్యాండ్ కొనడం అసాధ్యం కాబట్టి చాలా మంది నగర శివారు ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.
ముంబై హైవే మీద ఉన్న నిమ్జ్ వైపే అందరి చూపు ఉంది. అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుండడం, లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకనుండడంతో ఆ ఏరియాలో ప్లాటింగ్ కి డిమాండ్ ఏర్పడింది. ఏరియా పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ వచ్చే కంపెనీల్లో జాబ్ చేసుకోవచ్చు. అప్పటికి చుట్టూ పొరుగువారు ఉంటారు కాబట్టి ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు రూ. 9 లక్షలు పెట్టి స్థలం కొనుక్కుంటే.. రెండు, మూడేళ్ళలో దాని ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ముంబై హైవే పూర్తి స్థాయిలో డెవలప్ అయితే కనుక గజం రూ. 6 వేలు కాదు, చదరపు అడుగు రూ. 6 వేలు అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నాంగా.
గమనిక: మాకు దొరికిన డేటా ఆధారంగా సదాశివపేట దగ్గరలో ఓపెన్ ప్లాట్ ధరలు ఇవ్వడం జరిగింది. ఈ ధరల్లో మార్పులు అనేవి ఉంటాయి. స్థలం కొనేముందు రియల్ ఎస్టేట్ నిపుణుల సలహాలు, సూచనలు పాటించవలసిందిగా మనవి. పై కథనం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం ఇవ్వబడింది. ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టడం పూర్తిగా మీ బాధ్యత మాత్రమే.