ఈ మధ్య ఎలక్ట్రికల్ స్కూటర్ల వాడకం విరివిగానే పెరిగింది. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. వాటికి అదనంగా కొత్త మోడల్స్ కూడా వస్తూనే ఉన్నాయి. వాటిలో ఓలా కంపెనీ స్కూటర్లకు కాస్త ఎక్కువగానే డిమాండ్ ఉంది. ఇప్పుడు ఓలా కంపెనీ తమ మోడల్స్ పై మరిన్న ఆఫర్స్ ని ప్రకటించాయి.
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అద్భుతమైన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. అలాగే ఈవీ వాహన తయారీ కంపెనీలు కూడా వెహికల్స్ ధరలపై ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఓలా కంపెనీ తమ ఈవీ స్కూటర్లపై హోళీ సందర్భంగా డిస్కౌంట్స్ ప్రకటించింది. మీరు గనుక ఓలా స్కూటర్ కొనుగోలు చేయాలి అనుకుంటే మాత్రం ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు.
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఓలా కంపెనీకి ఎంతో గొప్ప పేరుంది. ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో మోడళ్లకు మంచి ఆదరణఏ లభించింది. ఇప్పుడు ఓలా స్కూటర్ల కొనుగేళ్లపై మంచి ఆఫర్స్ అందిస్తోంది. హోళీ సందర్భంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్స్ మార్చి 8 నుంచి 12 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా.. ఓలా ఎస్1 మోడల్ పై రూ.2 వేలు, ఎస్1 ప్రో మోడల్ పై రూ.4 వేలు వరకు అదనపు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. అలాగే ఓలా కంపెనీ నుంచి ఎక్స్ ఛేంజ్ లో ఈవీ స్కూటర్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. మీ పాత పెట్రోల్ వాహనాన్ని ఎక్స్ ఛేంజ్ చేస్తే రూ.45 వేల వరకు ఎక్స్ ఛేంజ్ బోనస్ ని పొందవచ్చు. హోళీ బోనస్ కూడా అదనంగా లభిస్తుంది.
కొనుగోలుదారులకు ఇంకో బంపరాఫర్ కూడా ఉంది. ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ల ద్వారా మీరు వాహనం కొనుగోలు చేస్తే రూ.6,999 వరకు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్ కూడా మీకు మార్చి 8 నుంచి 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదండోయ్ మార్చి 11, 12 తారీఖుల్లో ఓలా ఎక్స్ పీరియన్స్ కేంద్రాల్లో మీరు ఓలా ఈవీ స్కూటర్ ని కొనుగోలు చేస్తే మీకు ఓలా కేర్+ సబ్ స్క్రిప్షన్ లో 50 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఓలా కేర్+ ద్వారా మీకు లేబర్ ఆన్ సర్వీస్, థెఫ్ట్ అసిస్టెన్స్, పంక్చర్ అసిస్టెన్స్, హెల్ప్ లైన్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇయర్లీ వెహికల్ ఇన్ స్పెక్షన్, 24/7 అంబులెన్స్, డాక్టర్ సర్వీస్ కూడా లభిస్తుంది. ఓలా నుంచి ఈవీలపై ఇన్ని అద్భుతమైన ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉన్నాయి. మరి మీరు గనుక కొత్త ఈవీ స్కూటర్ కొనాలి అనుకుంటే మాత్రం ఓసారి ఈ ఓలాపై లుక్కేయండి.