ఇప్పుడున్న పరిస్థితిల్లో లక్షలు సంపాదించడం అనేది అసాధ్యం. చాలీ చాలని ఆదాయం.. దానికి తోడు పెరిగిపోతున్న ఖర్చులు. ఇవి చాలవన్నట్టు అప్పులు. ఇలా అనేక బడ్జెట్లతో మధ్యతరగతి, పేదవారి జీవితం తడిసి మోపెడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కొంత పోగేయాలని ప్రతీ తండ్రి కలలు కంటాడు. అలా అని లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదించడం అందరకి సాధ్యమయ్యే పని కాదు. వీరికున్న ఏకైక మార్గం.. రూపాయి.. రూపాయి పోగేయడమే. అలా భవిష్యత్తుకు భరోసాగా ఉండాలంటే.. ఉత్తమమైన పాలసీ ఎంచుకోవాలి.
మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎల్ఐసీ ఎప్పటికప్పుడు తన ప్రియమైన పాలసీదారుల కోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఈ పాలసీలు చాలా మందిని ధనవంతులను చేయటమే కాక.. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారికి ఆర్థికంగా అండగా కూడా ఉంటాయి. ప్రతి పాలసీకి వేరువేరు ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మనకు సరిపడే పాలసీని ఎంచుకోవటంలోనే అసలైన విజయం ఉంటుంది. ఈ విషయంలో ఎల్ఐసీ ఏజెంట్ల మాటల కంటే.. ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. తాజాగా ఎల్ఐసీ తెచ్చిన న్యూ ఎండోమెంట్ పాలసీలో రోజుకు కేవలం రూ.72 పొదుపుతో రూ.48 లక్షల ప్రయోజనాన్ని కల్పిస్తోంది. అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం..
ఇది ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ పాలసీ. అలాగే.. నాన్ లింకిడ్ ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్ లో పొదుపు చేసిన డబ్బుకి భద్రత కూడా ఉంటుంది. ఈ పాలసీని 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు వయసున్న ఎవరైనా తీసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయం కనీసం 12 ఏళ్ల నుంచి 35 ఏళ్ల పాటు ఉండాలి. కనిష్ట సమ్ అష్యూర్డ్ అమౌంట్ లక్ష రూపాయలు. గరిష్టంగా ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు. అయితే లక్ష రూపాయల సమ్ అష్యూర్డ్ కి వచ్చే డెత్ బెనిఫిట్ ను ఒకేసారి కాకుండా వాయిదాల పద్దతిలో చెల్లిస్తారు. నెలకు 5 వేలు, 3 నెలలకు 15 వేలు, 6 నెలలకు 25 వేలు, ఏడాదికి 50 వేల చొప్పున మెచ్యూరిటీ సమయంలో వచ్చే బెనిఫిట్స్ ని అందజేస్తారు. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న వ్యక్తి.. 35 ఏళ్ల పాలసీ టర్మ్ తో లక్ష రూపాయల సమ్ అష్యూరెన్స్ తో పాలసీ తీసుకుంటే.. వార్షిక ప్రీమియం 3 వేల వరకూ పొదుపు చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయానికి దాదాపు 2 లక్షల 50 వేలు వరకూ పొందవచ్చు.
అదే రూ. 48 లక్షల రాబడి రావాలనుకుంటే.. రూ. 10 లక్షల సమ్ అష్యూరెన్స్ తో 35 ఏళ్ల టర్మ్ తో పాలసీ ఎంచుకోవాలి. రోజుకు రూ. 72 పొదుపు చొప్పున నెలకు రూ. 2,079, ఏడాదికి రూ. 24,391 చెల్లించాలి. ఇలా 35 ఏళ్ల పాటు చెల్లించాలి. మెచ్యూరిటీ సమయానికి రూ. 48 లక్షల పైనే వస్తాయి. మీ పేరు మీదే కాకుండా మీ పిల్లల పేరు మీద కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. 12 ఏళ్లు లేదా 18 ఏళ్లు వయసు రాగానే పిల్లల పేరు మీద పొదుపు చేసుకుంటూ వెళ్తే.. మెచ్యూరిటీ సమయంలో వారికి 50 లక్షల దాకా అమౌంట్ వస్తుంది. ఈ డబ్బు వారి భవిష్యత్ కు అండగా ఉంటుంది.