100 సంవత్సరాల వరకు ప్రతి ఏటా రిటర్న్స్ అందించే ఏకైక పథకం. రోజుకు 44 రూపాయలను పెట్టుబడిగా మలచుకుంటే 100 ఏళ్లలో దాదాపు 28 లక్షల రూపాయలను రాబడిగా పొందవచ్చు.
పొదుపు చేయాలనే ఆలోచన ఉండాలే కానీ, ఎన్నో పొదుపు పథకాలు, పాలసీలు అందుబాటులో ఉన్నాయి. సంపాదించేది నాలుగు రూపాయలే అయినా అందులో ఒక రూపాయిని మీ పొదుపుగా మలుచుకోండి.. ఇదే మీ భవిష్యత్తుకు దారి చూపుతుంది. వయసులో ఉన్నప్పుడు ఆర్థిక కష్టాలు మనకు కనిపించవు. వయసు పైబడుతున్న కొద్దీ డబ్బు విలువ తెలుస్తుంది. రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితిలొస్తాయి. అందులోనూ.. ఏ చిన్న అనారోగ్యం ధరిచేరినా వేలకు వేలు దండుకుంటున్నారు. ఆ సమయంలో మీ భవిష్యత్తుకు […]
మధ్యతరగతి ప్రజలు లక్షలకు.. లక్షలు ఒక్కరోజులో సంపాదించడం చాలా కష్టం. రూపాయి.. రూపాయి.. పోగేసినా, రేపొద్దున ఏ కష్టం వస్తుందో తెలియదు. దేనికి ఖర్చువుతోందో తెలియదు. కనుక భవిష్యత్ అవసరాల కోసం ఏదేని పాలసీలను లేదా పొదుపు పథకాలను ఎంచుకోవడం ఉత్తమం. అలాంటి అద్భుతమైన ప్రయోజనాలు అందించే పథకాలు, పాలసీలు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో ఏది మంచిది, మనకు ఏది సరైనది ఎంచుకోవటమే ముఖ్యం. అందులోనూ.. ఎలాంటి టెన్షన్, రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి […]
నిన్న మొన్నటి వరకు గౌతం అదానీ గురించి మారుమూల జనానికి పూర్తిగా తెలియకపోవచ్చు. అపర కుబేరుడిగా, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఒక భారతీయుడిగా ప్రపంచానికి తానేంటో పరిచయం చేసుకున్నా, అతని పేరు పెద్దగా వినుండకపోవచ్చు. కానీ, ఎప్పుడైతే అమెరికన్ రీసెర్చ్ సంస్థ ‘హిండెన్ బెర్గ్’.. అదానీ కంపెనీ ఒక పేకమేడ అని నివేదిక ఇచ్చిందో.. ఆనాటి నుంచి ఆదానీయే ప్రపంచానికి ఒక వార్తలా మారారు. అదానీ సంపద తరిగిపోతోందని కొందరు, బిలియనీర్ల జాబితాలో ఆయన స్థానం గల్లంతయ్యిందని […]
డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి నోటా ఈ మంత్రమే. జాబ్ చేసినా, వ్యాపారం చేసినా డబ్బు సంపాదించడమే ప్రధాన లక్షణం. మానవతా విలువలు, ప్రేమానురాగాల కంటే డబ్బులకు ప్రాధాన్యత ఎక్కువైపోయింది. అందుకే ‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి వచ్చిందేమో అనిపిస్తోంది. ఇలాంటి రోజుల్లో ఏదేని అనుకోని ఆపద ఎదురైతే ఆదుకునే వారు కరువు. అందులోనూ.. వయస్సు మళ్లాక ఆర్థికసాయం కావాలంటే.. అది జరగని పనే అని చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితులలో […]
పిల్లలకు జన్మనివ్వడమే కాదు వారికి బంగారు భవిష్యత్ అందించడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. వారికి విద్యా బుద్ధులను నేర్పించి వారి కాళ్లమీద వారు నిలబడేలా ఉన్నత స్థాయికి చేర్చాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. కానీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోలేక విఫలమవుతారు. తమ వద్ద ఉన్న ఆర్థిక వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్ అందించడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి అవసరాలు పెరుగుతుంటాయి. విద్య, పెళ్లి.. వంటి వాటి కోస […]
‘గౌతమ్ అదానీ…’ ప్రపంచ బిలియనీర్లలో ఒక్కరు. అతి తక్కువ సమయంలోనే అంబానీని కూడా దాటేసి అదానీ సంపన్నడిగా మారాడు. అంబానీ కిందిస్థాయి నుంచి ఎదిగినట్లుగా ప్రపంచానికి తెలుసు. అందువల్ల ఆయన బిలియనీర్ జాబితాలో చోటు సంపాదించుకోవడం ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు. కానీ, అదానీ.. అలా కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన సంపద రెట్టింపు అవుతూ వచ్చింది. ఆంతీకాలంలోనే అంబానీని మించిన బిలియనీర్ గా జాబితాలోకెక్కారు. అందుకు కారణం.. షేర్ మార్కెట్. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టె వారి […]
దేశీయ ప్రభుత్వ రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) దేశవ్యాప్తంగా ఎల్ఐసీ కార్యాలయాల్లో ఉన్న అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 9,394 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలోని వివిధ డివిజనల్ కార్యాలయాల్లో 1408 ఖాళీలున్నాయి. ఏదేని విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులతో పాటు ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఈ […]
ప్రభుత్వ రంగ భీమా సంస్థ ‘ఎల్ఐసీ‘ బాధ్యతలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎల్ఐసీ సీఈఓగా ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే.. 66 ఏళ్ల చరిత్ర గల ఎల్‌ఐసీకి ప్రైవేటు వ్యక్తి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి అవుతుంది. ఎల్‌ఐసీ ఇటీవల స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈ నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసాన్ని నింపడానికి ప్రభుత్వం ఈ చర్యలు […]
భవిష్యత్ అవసరాల కోసం.. రూపాయి.. రూపాయి.. పోగేయడం అందరూ చేసే పనే. కాకుంటే.. వాటిని ఎలా పొదుపు చేస్తే మంచి రాబడి ఉంటుందన్నది చాలామందికి తెలియదు. సంపాదించిన ఆదాయాన్నంతా బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ.. ఎక్కువ మొత్తంలో రాబడి పొందలేకపోతున్నారు. ఒకవేళ తెలిసినా.. సురక్షితమైనవో.. కాదో.. అన్న భయంతో వెనుకడుగుస్తుంటారు. ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ అందిస్తున్న పొదుపు పథకాలను ఎంచుకుంటే.. మీ డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు. అత్యంత సురక్షితమైనవి మరియు అనేక ప్రయోజనాలు […]