నెల్లూరులో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఏ ఏ ఏరియాలో ప్లాట్ ధర ఎంతుంది? ఫ్లాట్ ధర ఎంతుంది? ఇండిపెండెంట్ హౌస్ ధరలు ఎలా ఉన్నాయి?
మనిషికి ఏదున్నా లేకున్నా ముందు నివసించడానికి ఒక ఇల్లు అనేది ఉండాలి. ఆ ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ల్యాండ్ రేట్లు అనేవి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పనే. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరంగా నెల్లూరు ఉంది. మరి నెల్లూరులోని ప్రముఖ ఏరియాల్లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఇండ్ల స్థలాల రేట్లు గానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలు గానీ, ఇండిపెండెంట్ హౌస్ ధరలు గానీ ఎలా ఉన్నాయి అనేది మీ కోసం.
పైన తెలుపబడిన ధరలను బట్టి నెల్లూరులోని ఈ ప్రాంతాల్లో ఇండ్ల స్థలం కావాలంటే 150 గజాలకు గాను రూ. 6 లక్షల నుంచి 42 లక్షల వరకూ అవుతుంది. అదే ఫ్లాట్ కైతే 150 గజాలకు గాను రూ. 22 లక్షల నుంచి 60 లక్షలకు పైనే ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే గనుక 150 గజాలకు గాను రూ. 24 లక్షల నుంచి రూ. కోటి 26 లక్షల పైనే ఉంటుంది. నెల్లూరులోని హరినాథపురం, ధనలక్ష్మి పురం, పొదలకూరు రోడ్, బీవీ నగర్ ప్రాంతాలు బెస్ట్ రెసిడెన్షియల్ ఏరియాస్ అని చెప్పవచ్చు. ఇక ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టాలంటే గనుక కాకుపల్లి, కాకుటూరు, కనుపర్తిపాడు, కోవూరు, పొట్టేపాళెం ప్రాంతాలు ఉత్తమం అని రియల్ ఈస్టర్ ప్రైజ్ ట్రెండ్స్ డేటా తెలుపుతుంది.
గమనిక: ఈ ధరలు కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దొరికిన ప్రాంతాల ధరల డేటా ఆధారంగా ఇవ్వబడింది. అసలు ఖచ్చితమైన ధరల కోసం రియల్ ఎస్టేట్ ఏజెన్సీలను, యజమానులను సంప్రదించవలసినదిగా మనవి. ప్రాంతాలను బట్టి, విక్రేతలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయని గమనించవలసినదిగా మనవి.