“దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది” అన్న వివేకానందుడి మాట అక్షరాల నిజం. దానికి తగ్గట్టుగానే.. దేశంలో ఎందరో ప్రతిభావంతమైన విద్యార్థులు ఉన్నారు. వారి వారి ప్రతిభను ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలా అద్భుతాలు సృష్టించే క్రమంలో కొందరు విద్యార్థులకి ఆర్థిక స్థోమత సరిపోక తమ రీసెర్చ్ లను మధ్యలోనే ఆపేస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వాలు అండగా నిలుస్తున్న మాట వాస్తవమే. ఇక ఇలాంటి ప్రతిభగల యువతకు సాయం చేయడానికి దేశంలోని కొన్ని కార్పోరేట్ సంస్థలు కూడా ముందుకొస్తుంటాయి. అలా కోటక్ మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన కోటక్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ లను అందించడానికి ముందుకు వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
దేశ యువతలో ప్రతిభకి కొదవలేదు. కానీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి కొన్ని కొన్ని సార్లు వారి ఆర్థిక స్థోమత సరిపోదు. ఈ క్రమంలోనే ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభగాల విద్యార్థినిలకు స్కాలర్ షిప్ ఇవ్వడానికి “కోటక్ కన్యా స్కాలర్ షిప్” ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. CSR ప్రాజెక్ట్ కింద ఈ స్కాలర్ షిప్ లు అందించడానికి కోటక్ మహీంద్రా ఎడ్యూకేషనల్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. న్యాక్ లేదా NIRF లాంటి గుర్తింపు పొందిన ఇన్ స్టిట్యూల్ లల్లో ప్రొఫెషనల్ కోర్సుల్లో అంటే ఇంజినీరింగ్, ఆర్కీటెక్చర్, ఇంటిగ్రేటెడ్ LLB, MBBS etc, మెుదటి సంవత్సరం గ్రాడ్యూయేషన్ కు అర్హత/ప్రవేశం పొందిన మహిళా విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు.
ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన అమ్మాయిలకు సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు స్కాలర్ షిప్ లభిస్తుందని ఫౌండేషన్ తెలిపింది. ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేయాలంటే.. ఇంటర్ లో 75 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. ఇక కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3.20 లక్షల లోపు ఉండాలి. ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేయడానికి చివరి తేది సెప్టెంబర్ 30 అని ఫౌండేషన్ తెలిపింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు అప్లై చేయడానికి www.b4s.in/it/KKGS12 ఈ లింక్ పై క్లిక్ చేయండి. మరి ప్రతిభగల పేద విద్యార్థినులకు స్కాలర్ షిప్ లు అందిస్తున్న మహీంద్రా ఫౌండేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Apply for Kotak Kanya Scholarship 2022 and stand a chance to get assistance of up to INR 1.5 lakh/year. Girl students who’ve taken admission in 1st-year professional graduation programmes like Engg, MBBS, Architecture, integrated LLB, etc. are eligible. https://t.co/ZDhMCLr4nr pic.twitter.com/r1fPRVrBdw
— Buddy4Study (@Buddy4Study) September 10, 2022