దేశంలో డేటా వినియోగం ఊహకందని రేంజులో పెరుగుతోంది. టెలికాం చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా, జియో యూజర్లు.. డేటా వినియోగంలో సరికొత్త రికార్డు నెలకొల్పారు.
ఐపీఎల్ మ్యాచ్‌లంటే.. ఆ క్రేజే వేరు. బ్యాటర్ల మెరుపులు, బౌలర్ల సంజ్ఞలు, ఫీల్డర్ల విన్యాసాలు.. అబ్బో ఆ హంగామానే వేరు. ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి వేలకు వేలు చెల్లించి మైదానానికి వెళ్లి వారు కొందరైతే.. టీవీల్లోనూ, మొబైలలోనూ చూసేవారు మరికొందరు. అందులోనూ ఈ ఏడాది జియో సినిమా ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా అందిస్తుండడంతో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కోట్ల మంది అభిమానులు మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయారు. ఈ క్రమంలోనే జియో యూజర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఒక నెలలో 10 ఎక్సాబైట్‌లు లేదా 10 బిలియన్ జీబీ డేటాను ఉపయోగించారు. ఇది దేశీయ టెలికాం చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం.
డేటా వినియోగంలో జియో వినియోగదారులు సరికొత్త రికార్డులు సృష్టించారు. ఒక నెలలోనే 10 ఎక్సాబైట్‌లు లేదా 10 బిలియన్ జీబీ డేటాను ఉపయోగించారు. డేటా వినియోగంలో ఇది అతి పెద్ద జంప్ అని జియో నెట్‌వర్క్ స్పష్టం చేసింది. వాత్సవంగా చెప్పాలంటే 2016కి ముందు దేశంలో డేటా వినియోగం అంతగా ఉండేది కాదు. ఉన్నా అది కేవలం 4.6 ఎక్సాబైట్‌లు మాత్రమే. అది కూడా పూర్తి సంవత్సర కాలం వినియోగం. కానీ ఇప్పుడు ఒక నెలలోనే 10 ఎక్సాబైట్‌ల డేటాను వాడేస్తున్నారు. సగటున ఒక్కో జియో యూజర్ నెలకు 23.1 GB డేటాను వినియోగిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇది 13.3 జీబీ. అంటే, కేవలం రెండేళ్లలో సగటు వినియోగదారుడు నెలకు 10 జీబీ అదనపు డేటాను ఉపయోగిస్తున్నారు.
డేటా వినియోగం ఇంతలా పెరగడానికి ప్రధాన కారణాలు.. జియో ట్రూ 5G సర్వీసులు, ఐపీఎల్ మ్యాచులే అని చెప్పుకోవాలి. 5G సర్వీసులు పొందాలంటే డేటా అధికంగా ఖర్చువుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఐపీఎల్ మ్యాచుల నేపథ్యంలో మొబైల్ లో వీక్షించే వారి సంఖ్యా బాగా పెరిగింది. ఈ కారణాల వల్లనే డేటా వినియోగం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదిలావుంటే 5G సర్వీసుల నేపథ్యంలో రిలియన్స్, దేశవ్యాప్తంగా 3,50,000 కంటే ఎక్కువ 5G సెల్ టవర్లను ఇన్‌స్టాల్ చేసింది. ఇప్పటివరకు 2,300 పట్టణాలు, నగరాలలో జియో ట్రూ 5G సేవలు అందిస్తోంది. ఇక 2023 చివరి నాటికి దేశమంతటా 5G సేవలను అందుబాటులోకి తేనుంది.
Jio sets a new record: Users consumed a record 10 Billion GB of data per month.
The report states over 30 exabytes of Internet data was used by subscribers in the first three months of 2023.#Jio #Reliance #5G #JioCinema pic.twitter.com/swmy307A8L
— TechKnow IT (@Mr_Techie) April 24, 2023