జియో.. టెలికాం రంగంలో ఈ కంపెనీ సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు. ఇంటర్నెట్ విషయంలో అయితే ఇది సరికొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఇప్పుడు 5జీ సేవలను కూడా ప్రారంభించింది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలను పరీక్షిస్తున్నారు. 5 జీ సెర్వీసెస్ అవైల్ చేసుకుంటే మీరు చేసుకునే రీఛార్జులను బట్టి మీరు అన్ లిమిటెడ్ కాల్స్, 5జీ స్పీడ్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్లు పొందవచ్చు. చాలా మందికి ఇక్కడివరకే తెలుసు. కానీ, ఇప్పుడు జియో రీఛార్జ్ ప్లాన్ తో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కంటెంట్ ఫ్రీగా చూడచ్చని మీకు తెలుసా? ఏంటి తెలీదా? సరే ఏ ఏ ప్లాన్స్ తో ఈ అవకాశం పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.
జియో ఇప్పటికే ఎన్నో రీఛార్జులపై ఫ్రీగా జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ, జియో టీవీ వంటి సదుపాయాలను అందిస్తోంది. ఇప్పుడు నెట్ ప్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కంటెంట్ ఫ్రీగా ఇస్తోంది. కాకపోతే ఇప్పటికి ఈ ఆఫర్ కేవలం పోస్ట్ పెయిడ్ వారికి మాత్రమే అందిస్తోంది. ఈ ప్లానులతో జియో పోస్ట్ పెయిడ్ యూజర్లు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కంటెంట్ ఫ్రీగా చూడచ్చు. ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండానే ఫ్రీగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాగిన్ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఆఫర్ కేవలం పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందిస్తున్నారు.
ఆ రీఛార్జ్ ప్లానులు ఏవంటే.. రూ.399 రీఛార్జ్ ప్లాన్ తో 75 జీబీ డేటా, 100 ఎంఎంఎస్ లు, నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్, అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ని అందిస్తున్నారు. రూ.599 రీఛార్జ్ ప్లాన్ తో 100 జీబీ డేటా, రోజుకి 100 ఎస్‌ఎంఎస్ లు, 100 జీబీ డేటా అయిపోయిన తర్వాత 1 జీబీ డేటా వచ్చి రూ.10 ఛార్జ్ చేస్తారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ తో పాటుగా జియో యాప్స్ కూడా అందిస్తారు. ఇంక రూ.799 రీఛార్జ్ ప్లాన్ తో 150 జీబీ డేటా, ఎస్‌ఎంఎస్ లు, ఓటీటీ యాక్సెస్ ఇస్తారు. రూ.999 ప్లాన్ తో 200 జీబీ డేటా ఓటీటీ ప్లాట్ ఫామ్స్, ఎస్‌ఎంఎస్ లు అందిస్తారు. చివరిగా రూ.1,499 రీఛార్జ్ ప్లాన్ తో 300 జీబీ డేటా, ఓటీటీ లాగిన్స్, ఎస్‌ఎంఎస్ లు, సెలక్టెడ్ సిటీలలో రోమింగ్ ఫ్రీగా అందిస్తోంది.