ఇటీవల కాలంలో నెలనెలా మొబైల్ రీఛార్జి అనేది కష్టంగా భావిస్తున్నారు వినియోగదారులు. ఇలా కాదని ప్రతినెలా రీఛార్జి చేసే ఆలోచన లేకుండా ఒకేసారి ఎక్కువరోజులు వ్యాలిడిటీ ఉన్న రీఛార్జి ప్లాన్స్ వైపు దృష్టి పెడుతున్నారు. అయితే.. ఏడాది కాలం వ్యాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్స్ చూసుకుంటే ఎక్కవ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వినియోగదారులు అటు అధిక మొత్తంలో డబ్బు పెట్టలేక, ఇటు ప్రతినెలా రీఛార్జి చేయలేక ఆలోచనలో పడుతుంటారు.
నెలనెలా రీఛార్జికే ఎక్కువ ఖర్చు పెడుతున్నామని భావించే వారికోసం జియో యాజమాన్యం.. ప్రస్తుతం ఉన్నవాటిలో బెస్ట్ ప్లాన్ ఏదో చెప్పుకొచ్చింది. జియో 84 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్యాక్స్ చాలా మేలు అంటుంది. ఇప్పుడు అన్ని టెలికం సంస్థలు 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ఇక 84రోజుల కాలపరిమితిలో తక్కువ ధర ప్లాన్ కావాలనే వారికి రిలయన్స్ జియో ఎన్నో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. అయితే జియో అందిస్తున్న 84 రోజుల ప్లాన్ ధర రూ.666 గా ఉంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5GB డేటా.. అంటే మొత్తం ప్లాన్ పూర్తయ్యేలోగా 126GB డేటా వస్తుంది. దీంతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS లు లభిస్తాయి. ఈ లెక్కన రోజుకు రూ.7.63 ఖర్చు అవుతుందని తెలిపింది.
ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే జియో, సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి జియో యాప్స్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. జియోలో ప్రస్తుతం రోజుకు 2GB, 3GB డేటా వచ్చే(84 రోజుల వ్యాలిడిటీ) ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే 84 డేస్ కి తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ అంటే మాత్రం రూ.666 ప్లాన్ మంచిదని జియో పేర్కొంది. మరి జియో 84డేస్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.