మొబైల్ వినియోగదారులకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కనీస రీఛార్జి మొత్తాన్ని గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేసిన ఎయిర్‌టెల్ మరోసారి రీఛార్జ్ ధరల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు భారతీ ఎయిర్‌టెల్ సీఈవో సునీల్ మిత్తల్ సంకేతాలు పంపారు.
ఒకప్పుడు ఫోన్‌లో మాట్లాడాలంటే ఎంతో ఆలోచించేవారు. ఎక్కువ సేపు మాట్లాడితే రీఛార్జ్ చేసుకున్న అమౌంట్ మొత్తం అయిపోతుందని భయపడిపోయేవారు. మాటలు పొదుపుగా వాడేవారు. కానీ, జియో విప్లవం కారణంగా టెలికాం రంగంలో పెనుమార్పులు వచ్చాయి. ఇంటర్‌నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్‌నెట్, టాక్‌టైం ధరలు ఒక్కసారిగా పాతాలానికి చేరుకున్నాయి. నెల రీఛార్జ్, అన్‌లిమిటెడ్ రీఛార్జ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇక, అప్పటివరకు టాప్‌లో ఉన్న చాలా కంపెనీలు నేలపై పడిపోయాయి. అలాంటి వాటిలో ఎయిర్ టెల్ ఒకటి. జియో […]
ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్. మొబైల్ రీఛార్జులపై పేటీఎం అదనపు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. రీఛార్జి మొత్తాన్ని బట్టి రూ.1 నుంచి రూ.6 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పేటీఎం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోయినప్పటికీ.. అందుకు సంబంధించి కొందరు వినియోగదారులు సోషల్ మీడియా ఖాతాల్లో స్క్రీన్ షాట్‌లను పోస్ట్ చేస్తున్నారు. ఫోన్ పే ఇప్పటికే.. రూ.50 పైబడి చేసే రీచార్జులపై సర్ చార్జీలను వసూలుచే స్తోంది. పేటీఎం […]
ప్రారంభంలో వినియోగదారులను ఆకర్షించుకునేందుకు టెలికాం కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. చాలా తక్కువ ధరకే మొబైల్ డాటాను, అన్ లిమిటెడ్ కాల్స్ ప్రకటించాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగం, స్మార్ట్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగిన తరువాత.. టెలికం కంపెనీలు యూజర్లుకు భారీ షాకిచ్చాయి. దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలు పోటీ పడుతూ మొబైల్ ఇంటర్నెట్ ప్లాన్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఇదే అదునుగా ప్రభుత్వ రంగ టెలికాం […]
ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జి ప్లాన్స్ ధరలు పెంచతూ వినియోగాదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయినటువంటి BSNL.. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలతో పోటీగా నిలబడేందుకు కొత్త ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం సంస్థలు అందించిన ప్లాన్స్ రేటు ఎక్కువగా ఉంటున్నాయి. వ్యాలిడిటీ కూడా 28 రోజులకే పరిమితం. అయితే BSNL కొన్ని షరతులతో రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ […]
ఇటీవల కాలంలో నెలనెలా మొబైల్ రీఛార్జి అనేది కష్టంగా భావిస్తున్నారు వినియోగదారులు. ఇలా కాదని ప్రతినెలా రీఛార్జి చేసే ఆలోచన లేకుండా ఒకేసారి ఎక్కువరోజులు వ్యాలిడిటీ ఉన్న రీఛార్జి ప్లాన్స్ వైపు దృష్టి పెడుతున్నారు. అయితే.. ఏడాది కాలం వ్యాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్స్ చూసుకుంటే ఎక్కవ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వినియోగదారులు అటు అధిక మొత్తంలో డబ్బు పెట్టలేక, ఇటు ప్రతినెలా రీఛార్జి చేయలేక ఆలోచనలో పడుతుంటారు. నెలనెలా రీఛార్జికే ఎక్కువ ఖర్చు […]
ఇప్పటికే పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, నిత్యవసరాల ధరలకు తోడు డిజిటలైజేషన్‌తో మన నిత్యజీవితంలో భాగమైన మనీ ట్రాన్సాక‌్షన్ యాప్‌లు కూడా సామాన్యుడి నడ్డి విరేచేందుకు సిద్ధమయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేసి రూ.120 మార్క్ చేరుకునేందుకు పరుగుపెడుతున్నాయి. ఇదే బాటలో ప్రైవేటు రంగంలోని డీటీహెచ్, ప్రైమ్ వీడియోల సబ్‌స్క్రిప్షన్స్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఫోన్‌పే వచ్చి చేరింది. ఇంత కాలం ఉచితంగా అందించిన సర్వీసులకు యూజర్ ఛార్జీలను చేర్చింది. వినియోగదారులకు నేరుగా ఈ […]