మొబైల్ వినియోగదారులకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కనీస రీఛార్జి మొత్తాన్ని గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేసిన ఎయిర్‌టెల్ మరోసారి రీఛార్జ్ ధరల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు భారతీ ఎయిర్‌టెల్ సీఈవో సునీల్ మిత్తల్ సంకేతాలు పంపారు.
మొబైల్ వినియోగదారులకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కనీస రీఛార్జి మొత్తాన్ని గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేసిన ఎయిర్‌టెల్ మరోసారి రీఛార్జ్ ధరల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు భారతీ ఎయిర్‌టెల్ సీఈవో సునీల్ మిత్తల్ సంకేతాలు పంపారు. ఈ ఏడాది మధ్యలో టారిఫ్ ఛార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందంటూ ప్రకటన చేశారు. అంతేకాదు.. ఈ పెంపు వల్ల ప్రజలపై పడే భారం ఇతర ఖర్చులతో పోలిస్తే.. చాలా తక్కువంటూ ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు.
గత నెలలో భారతీ ఎయిర్‌టెల్ 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న కనీస రీఛార్జ్ ధరను 57శాతం పెంచింది. అలాగే, రూ.99 కనీస రీఛార్జీ ప్లాన్‌ను నిలిపివేసింది. ఇది చాలదన్నట్టు మరోసారి టారిఫ్ ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మధ్యలో టారిఫ్ ఛార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఎయిర్‌టెల్ సీఈవో సునీల్ మిత్తల్ తెలిపారు. టెలికాం పరిశ్రమ వ్యాపారంలో మూలధన రాబడి తక్కువగా ఉన్న కారణంగా టారిఫ్ ఛార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందని చెప్పారు. వివిధ వస్తువులపై ప్రజలు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే.. ఇది తక్కువే ఉంటుందన్నారు. దేశానికి బలమైన టెలికాం సంస్థ అవసరమన్న మిత్తల్.. భారత్ డిజిటల్-ఆర్థికవృద్ధి కల సాకారమైనట్లు వివరించారు. కాగా, ఎయిర్‌టెల్ 5జీ యూజర్లు 10 మిలియన్ల దాటినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 24 చివరి నాటికి 5జీ సేవలు దేశంలోని ప్రతి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చేరువయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపారు.
Bharti Airtel is looking to raise mobile phone call and data rates across all plans this year, says chairman Sunil Bharti Mittal
Read more: https://t.co/xhk7UHvINi#BhartiAirtel #airtel #Telecom #TBReports pic.twitter.com/1Varjn1Kqd
— The Brands (@thebrandsindia) March 1, 2023
గత కొంతకాలంగా ఎయిర్‌టెల్ ధరల పెంపు అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది. దీంతో త్వరలోనే ఎయిర్‌టెల్ ధరల పెంపు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. నెల రోజులకు గానూ ఒక యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని ఆర్పుగా పేర్కొంటారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఆర్పు రూ.190గా ఉండగా, దానిని రూ. 300కు తీసుకెళ్లాలనని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి
జియో ఆర్పు రూ.177.2 గా ఉండగా, వొడాఫోన్-ఐడియా ఆర్పు కేవలం రూ.131 మాత్రమే ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ఎయిర్‌టెల్ సగటు ఆదాయమే అధికంగా ఉంది. అయినప్పటికీ పెంపు వైపే మొగ్గు చూపుతోంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bharti Airtel Chairman Sunil Bharti Mittal said a tariff hike can be expected by mid of 2023 as the return on capital in the telecom business is very low…#Techinformer #Airtel pic.twitter.com/WW2TNsAYo8
— Tech Informer (@Tech_Informer_) March 1, 2023