నిన్న మొన్నటి వరకు గౌతం అదానీ గురించి మారుమూల జనానికి పూర్తిగా తెలియకపోవచ్చు. అపర కుబేరుడిగా, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఒక భారతీయుడిగా ప్రపంచానికి తానేంటో పరిచయం చేసుకున్నా, అతని పేరు పెద్దగా వినుండకపోవచ్చు. కానీ, ఎప్పుడైతే అమెరికన్ రీసెర్చ్ సంస్థ ‘హిండెన్ బెర్గ్’.. అదానీ కంపెనీ ఒక పేకమేడ అని నివేదిక ఇచ్చిందో.. ఆనాటి నుంచి ఆదానీయే ప్రపంచానికి ఒక వార్తలా మారారు. అదానీ సంపద తరిగిపోతోందని కొందరు, బిలియనీర్ల జాబితాలో ఆయన స్థానం గల్లంతయ్యిందని మరికొందరు మాట్లాడుతున్నారు. ఇది వాస్తవమే అయినప్పటికీ.. ఆ భయం అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారికి నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోంది.
ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలైన ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ కస్టమర్లు, ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. అందుకు కారణం.. ఈ రెండు సంస్థలు అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్ఐసీ 4 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయగా, ఎస్‌బీఐ 2.6 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. అయితే, హిండెన్ బెర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ విలువ అంతకంతకు పతనమవుతుండడంతో తమపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని ఎస్‌బీఐ డిపాజిటర్లు, ఎల్ఐసీ పాలసీదారులు కలవరానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అదానీ ఆస్తి పతనంపై కేంద్ర ప్రభుత్వం తొలిసారి స్పందించింది. అదానీ గ్రూపు స్టాకుల పతన ప్రభావం ఎస్‌బీఐ, ఎల్‌ఐసీల కస్టమర్లపై స్వల్పమేనని వెల్లడించింది.
Chairman @gautam_adani‘s address to investors after withdrawal of the fully subscribed AEL FPO#GrowthWithGoodness #NationBuilding #AdaniGroup pic.twitter.com/f9yaYrxCzx
— Adani Group (@AdaniOnline) February 2, 2023
షేర్ మార్కెట్ లో అదానీ గ్రూప్ సృష్టిస్తున్న విలయం అందరికీ తెలిసిందే. లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. గత వారం హిండెన్‌బర్గ్ నివేదికతో మొదలైన ఈ సంచలనాలు.. రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూయేషన్ సగానికిపైగా పతనమైంది. దాదాపు 120 బిలియన్ డాలర్లు దిగజారింది. ఈ లెక్కలు.. భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.8 లక్షల కోట్లకు సమానం. ఈ పరిణామాలపై ఇన్నాళ్లు మౌనం వహించిన కేంద్రం తొలిసారి పెదవి విప్పింది. ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రైవేటు కంపెనీల వ్యక్తిగత సంపద పతనంపై స్పందించలేమన్న ఆయన, ఆయా కంపెనీల బాలాలు, బలహీనతల ఆధారంగా సంపద పెరుగుతుంది, తరుగుతుంది అని వ్యాఖ్యానించారు.
“ప్రైవేటు కంపెనీల వ్యక్తిగత సంపదపై, వారి లాభ నష్టాలపై మాట్లాడాను. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ విషయంలో మాత్రమే నేను స్పందిస్తాను. ఈ రెండు సంస్థల్లోని ఇన్వెస్టర్లు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. రిస్క్ పరిమితికి లోబడే ఈ రెండు సంస్థలు అదానీ కంపెనీల్లో పెట్టుబడిపెట్టాయి. ఒక కంపెనీ నష్టాలు చూసినంత మాత్రాన అది ఇతర కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపదు. జాతీయ బ్యాంకులు లేదా కంపెనీలకు చెందిన డిపాజిటర్లు/పాలసీహోల్డర్లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను..” అని ఫైనాన్స్ సెక్రటరీ సోమనాథన్ స్పష్టం చేశారు.
“Both SBI, LIC have issued detailed statements. They have clearly said that their exposure is well-within permitted limit”: FM #Nirmala Sitharaman (@nsitharaman) speaks on opposition’s attack over Adani-Hindenburg row #AdaniGroup #HindenburgReport #FMToNetwork18 | @18RahulJoshi pic.twitter.com/TQjJsBudpN
— News18 (@CNNnews18) February 3, 2023
మరోవైపు.. అదానీ గ్రూప్ షేర్ల ప్రభావం పార్లమెంట్‌పై కూడా పడింది. అదానీ గ్రూప్‌పై, హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెలువడిన రోజుల వ్యవధిలోనే గౌతం అదానీ సంపద భారీగా పతనమయ్యింది. ఈ ప్రభావంతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో గౌతం అదానీ నంబర్ 2 నుంచి నెంబర్ 21వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 61.3 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతం అదానీపై, షేర్ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై, కేంద్రం వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Opposition parties seek JPC probe into Hidenburg-Adani row, Congress to protest outside LIC offices on Jan 6
Read @ANI | https://t.co/zK5BeJw6cx#Congress #LIC #SBI #Adaniscam #Adani pic.twitter.com/ae6GxbPAg8
— ANI Digital (@ani_digital) February 2, 2023