నేటికాలంలో ఆన్ లైన్ బిజినెస్ బాగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు మెట్రో సిటీ, నగరాలకే పరిమితమైన ఈ ఆన్ లైన్ బిజినెస్.. పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు కూడా విస్తరిస్తోంది. ఫలితంగా స్థానికంగా ఉండే వారికి ఉద్యోగావకాశలు పెరిగాయి. ఒకప్పుడు ఉద్యోగాలు, ఉపాధి లేక నగరాలకు వలస పోయిన యువత..ఇప్పుడు సొంత రాష్ట్ర, ఉన్న జిల్లాలోనే దర్జాగా బ్రతుకుతున్నారు. డెలివరీ బాయ్స్ కు భారీగా డిమాండ్ పెరుగుతుంది. అందులోనూ ప్రస్తుతం డెలీవరి బాయ్స్ గా చేస్తున్న వారిలో దాదాపు 85 శాతం మంది యువతే ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం రెండే అర్హతలు ఉంటే చాలు. సొంత ఊరిలో ఉంటునే నెల రూ.25వేల నుంచి రూ.30 వేలు సంపాదించ వచ్చు.
ఎంత పని చేస్తే మంచి జీతం, ఇన్సెంటివ్ వస్తుంది. కేవలం టూ వీలర్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు మంచి జాబ్ దొరికినట్లే. అందుకే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని యువతకు ఉద్యోగాలపై ఆసక్తి చూపించేలా ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు గాలం వేస్తున్నాయి. అక్కడ ఇంట్లో అవసరమయ్యే వస్తువులతో పాటు ఆహార పదార్థాలను కూడా ఆర్డర్ పై తెప్పించుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందంట. దీంతో ఒక్కసారిగా డెలవరీ బాయ్స్ కు డిమాండ్ పెరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఆన్ లైన్ బిజినెస్ సంస్థలు 64 ఉంటే 5వేల మంది పని చేస్తున్నారనట్లు సమాచారం.
అందులో 20 నుంచి 30 ఏళ్ల లోపు వయసు 80శాతం వరకు ఉన్నారు. ఓ ఉద్యోగి రోజు కనీస వేతనంగా వెయ్యి రూపాయలు పొందుతున్నారు. అంటే నెలకు రూ.30 వేలు. సొంత వాహనం కలిగి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే చాలు వారికి పాన్ కార్డు ఉంటే ఉద్యోగం వచ్చినట్లే. నెలకు కనీసం రూ.10 నుంచి రూ.50 వేల వరకు సంపాధించే వాళ్లు కూడా ఉన్నారు. డెలివరీ బాయ్స్‌గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్లలో 50శాతం మంది పదవ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన వాళ్లే ఉన్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇంకొందరు డెలవరీ బాయ్‌గా పనిచేస్తూ ఫ్యామిలీకి సపోర్ట్‌గా నిలుస్తునే డిగ్రీ, వృత్తి విద్య కోర్సులు చేస్తున్నారు.
ప్రతి రోజు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 32 వేల ఆర్డర్లకు వస్తున్నాయని వాటి విలువ దాదాపు 80 లక్షలు ఉంటుందని నెలకు 24 కోట్ల వ్యాపారం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తుల మిగిలిన అన్ని జిల్లాలోనూ ఈ ఆన్ లైన్ బిజినెస్ వస్తుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, డెలివరీ బాయ్స్ కి కావల్సిన పై అర్హతలు ఉంటే.. మంచి జీతంతో సొంత ఊరిలోనే బిందాస్ గా బ్రతికేయవచ్చు. పైన తెలుపడిన విషయాలు స్థానిక వ్యాపారులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుపడింది. ఆసక్తి ఉన్నవారు స్థానికంగా ఉన్న ఆన్ లైన్ బిజినెస్ సంస్థలో తెలుసుకోవాలి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.