ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మల్లుతున్నారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వాహనదారులను ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మళ్లేలా పోత్సహిస్తున్నారు. కాకపోతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యమైనది వాటి ధర. అవును ఎలక్ట్రిక్ వాహనాల ధర కూడా లక్షల్లో ఉంటోంది. అందుకే ఆ వాహనాలను కొనుగోలు చేసేందుకు కాస్త వెనుకాడుతున్నారు. అయితే ఇప్పుడు ఓ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు శుభవార్త చెబుతోంది. కేవలం 35 వేలకే వాహనాన్ని అందిస్తోంది. అది ఏ కంపెనీ, దాని పూర్తి ఫీచర్లు ఏంటని తెలుసుకుందాం.
తక్కువ ఖర్చు అవుతుందే దృష్టితోనే ఎలక్ట్రిక్ వాహనాల వైెపు వినియోగదారులు మళ్లుతున్నారు. వీటికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా చాలా ఈ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే బజాజ్, హీరో, ఓలా, ఎథర్ వంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాటికి ఇంకా కొన్ని కొత్త కంపెనీలు కూడా వచ్చి చేరుతున్నాయి. కాకపోతే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఐఐటీ ఢిల్లీకి చెందిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ బాజ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా దుమ్ము, ధూళిని తట్టుకునేందుకు ఐపీ65 సర్టిఫికేట్ కూడా ఉంది. ఈ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలో మీటర్లు ప్రయాణం చేయచ్చు.
అంతేకాకుండా ఈ స్కూటర్ కేవలం 1624 ఎంఎం మాత్రమే పొడవు ఉంటుంది. దీని విడ్త్ కేవలం 680 ఎంఎం మాత్రమే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అంతేకాకుండా దీనిని నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసర్లేదు. 90 సెక్లలోనే మీ బైక్ బ్యాటరీస్ మార్చుకొని నిరంతరాయంగా ప్రయాణం సాగించవచ్చు. ఈ స్కూటర్ లో వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. అలాగే ఫోర్క్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంది. ఇది వాహనాన్ని ఎంతో స్మూత్ గా వెళ్లేందుకు సహకరిస్తాయి. దీనిలో ఫైండ్ మై బైక్ ఫీచర్ ఉంది. మీ స్కూటర్ ఎక్కడున్నా గుర్తించొచ్చు. ఈ బైక్ గరిష్టంగా 25 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు. సిటీల్లో కార్యాలయాలకు వెళ్లేందుకు ఈ బైక్స్ యూజ్ అవుతాయి. వీటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.
Okay, #baazigars, Time for the Highlights.
So, as you all know, we launched the Baaz Scooter, a Made in India Rugged Scooter, built specifically for the #gig #delivery Riders of India.Sharing here the Launch Video of the Baaz and some kickass images from the event.#BaazBikes pic.twitter.com/ahaPfFtpb5
— Baaz Bikes (@baazbike) October 29, 2022