Netflix: అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్, జే5, ఆహా, ఓహో అని మూవీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ లు చాలానే ఉన్నాయి. ఇన్ని ఓటీటీ యాప్ లకి డబ్బులు కట్టి సబ్ స్క్రైబ్ చేసుకోవడం అవసరమా మనకి? అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒరేయ్ నువ్వు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకో, నువ్వు నెట్ ఫ్లిక్స్ తీసుకో, నువ్వు ఆహా తీసుకో, నువ్వు ఊహా తీసుకో అంటూ ఒక్కొక్కరూ ఒక్కో స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ని షేర్ చేసుకుంటారు. దీని వల్ల ఏడాది మొత్తం అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లకి కలిపి ఒకడే బిల్ కట్టినట్టు అవుతుంది. ఒక టికెట్ మీద వంద సినిమాలు అన్నట్టు.. ఒకడి బిల్ మీద మొత్తం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ సినిమాలు చూసేయచ్చు. బిల్ ఒకడిది, థ్రిల్ అందరిదీ. ఏ మనసున్న మారాజో అయితే.. అతనొక్కడే అన్ని స్ట్రీమింగ్ యాప్ లని సబ్ స్క్రైబ్ చేసుకుంటాడు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఆలోచించేవాళ్ళు మీలో ఉన్నారా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజర్ నేమ్, పాస్వర్డ్ లు షేర్ చేస్తున్నారా? అయితే మీకు ఇది షాకింగ్ న్యూసే. ఇకపై మీ ఆటలు సాగవనివ్వమని నెట్ ఫ్లిక్స్ సంస్థ చెబుతోంది.
యూజర్లు తమ అకౌంట్లను, పాస్వర్డ్ లను ఇతరులతో షేర్ చేసుకునే సౌలభ్యాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ నిలిపివేసే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం పాస్వర్డ్ షేరింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్ ను టెస్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కోస్టా రికా, చిలీ, పెరూలోని కొత్త యూజర్ల కోసం ‘యాడ్ ఎక్స్ ట్రా మెంబర్’ అనే ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో యూజర్లు కేవలం తమ ఇళ్లలో నివసించే వారికి మాత్రమే పాస్వర్డ్ షేర్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇతరులతో పాస్వర్డ్ షేర్ చేయాలనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఈ విధానం అమలులో ఉంది. ఈ ఏడాది చివరికి అన్ని దేశాల్లోనూ ఈ విధానాన్ని కొనసాగించాలని నెట్ ఫ్లిక్స్ భావిస్తోంది. మీ ఇంట్లో వారికి తప్ప ఇతరులకు మీ అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేస్తే అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ ఛార్జీలు రూ. 250 నుండి రూ. 350 వరకూ ఉంటుందని అంచనా. ఒకవేళ ఇదే గనుక అమలులోకి వస్తే మిగతా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లు కూడా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే యూజర్ల గుండెల్లో పిడుగు పడినట్టే అవుతుంది.
మరోవైపు సోషల్ మీడియాలో కొంతమంది తమ అకౌంట్ వివరాలను ఇతరులకు పంచుతూ డబ్బులు వసూలు చేస్తున్నారన్న కారణం కూడా అయి ఉండవచ్చునని అంటున్నారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి కొంత డబ్బు చెల్లించి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి ప్లాట్ ఫార్మ్స్ ని సబ్ స్క్రైబ్ చేసుకుంటాడు. అతను తక్కువ డబ్బులకి సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులకి వివరాలు అందిస్తాడు. ఆ విధంగా వారు అసలు కంటే తక్కువ ధరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశం ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు కూడా నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా గానీ నెలకి 500, 1000 రూపాయలు చెల్లించినా న్యాయం చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు కట్టిన డబ్బులకి న్యాయం చేసేందుకు ఊళ్ళో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి పాస్వర్డ్ షేర్ చేయడం అన్నది సహజం. ఇప్పుడు దానికి కూడా ఛార్జీలు వసూలు చేస్తే ఇక నెట్ ఫ్లిక్స్ సంస్థ దుకాణం సర్దేయాల్సిందే అని అంటున్నారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సంస్థ నష్టాల్లో నడుస్తోంది. ఇప్పుడు ఈ విధానాన్ని అమలులోకి తీసుకొస్తే గనుక సంస్థ షెడ్ కెళ్ళిపోవడం ఖాయమని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Tanushree Dutta: బాలకృష్ణ హీరోయిన్ పై భారీ కుట్ర! సంచలనం రేపుతున్న స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలు!
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ “రంగస్థలం”లో కూడా కళ్ళు చెదిరే గ్రాఫిక్స్! సుకుమార్ అప్పట్లోనే!