హిండెన్‌బర్గ్ నివేదకలు.. గత కొన్ని రోజులుగా భారదేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నివేదికల దెబ్బకు గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఇక తాజాగా ఎస్‌వీబీ బ్యాంక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెటిజనులు హిండెన్‌బర్గ్‌పై విమర్శలు చేస్తున్నారు.
కాలిఫోర్నియా, శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం ఆరంభం అయిన సంగతి తెలిసిందే. అమెరికాలోనే 16వ అతిపెద్ద బ్యాంక్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాక ఎన్నో టెక్ కంపెనీలకు ఆధారం అయిన ఈ బ్యాంక్ దీవాళ తీయడం సంచలనంగా మారింది. టెక్ ఆధారిత వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు నిధులు అందించడం ఈ బ్యాంక్ ప్రత్యేకత. కాలిఫోర్నియా పరిధిలోని ఎన్నో స్టార్టప్ కంపెనీలకు, టెక్ కంపెనీలకు ఎస్‌వీబీ అతి పెద్ద రుణ దాత. అలాంటి బ్యాంక్ ఇటీవల కాలంలో ఎదురైన కొన్ని నష్టాలను పూడ్చుకునేందుకు, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించినట్లు.. 2.25 బిలియన్ డాలర్ల వాటా విక్రయించనున్నట్లు గురువారం ప్రకటన చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుండగా.. కొందరు నెటిజనులు మాత్రం హిండెన్‌బర్గ్‌పై విమర్శలు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో హిండెన్ బర్గ్ పేరు భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ గౌతమ్ అదానీ కంపెనీలై వెల్లడించిన నివేదక మన దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అదానీ కంపెనీల షేర్ వాల్యూ పాతాళానికి పడిపోయింది. ఇక రాజకీయ విమర్శలు నేటికి కూడా చల్లరాడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా అమెరికాలో అతిపెద్ద బ్యాంక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్‌వీబీలో చోటు చేసుకున్న అవకతవకల గురించి హిండెన్‌బర్గ్ ఎలాంటి నివేదిక విడుదల చేయకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో హిండెన్‌బర్గ్ తీరుపై నెటిజనులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పాపం హిండెన్ బర్గ్.. అదానీ మీద ఫోకస్ చేసి.. ఎస్‌వీబీ అంశాన్ని పట్టించుకోలేదేమో అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ నటుడు విందు దారా సింగ్ సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. హిండెన్‌బర్గ్ ఎస్‌వీబీ బ్యాంక్ వైఫల్యం గురించి ఎందుకు అధ్యయనం చేయలేదని ప్రశ్నించాడు.. మరొక నెటిజన్ స్పందిస్తూ.. “అదానీ గ్రూప్ తన రుణాలన్నింటినీ తిరిగి చెల్లించింది (షేర్ కొలేటరల్‌పై), అయితే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీని స్కామ్‌గా పేర్కొంది, కానీ ఎస్‌వీబీ గురించి ఒక్క మాట చెప్పలేదు. హిండెన్‌బర్గ్ పరిశోధన ఎంత ఖచ్చితంగా, నిజాయతీగా ఉంటాయో దీన్ని బట్టి అర్థం అవుతోంది అంటూ కామెంట్ చేశాడు.
మరోక యూజర్ ‘‘ఇది మోసాలలోకెల్లా అత్యంత భారీ మోసం. హిండెన్ బర్గ్ లాంటి అమెరికా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు రిపోర్టులను ప్రచురించడం, డబ్బు సంపాదించడం ద్వారా భారతీయ కంపెనీలు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలనుకుంటున్నాయి. వీటికి తమ దేశంలో చోటు చేసుకున్న ఎస్‌వీబీ లాంటి భారీ అవకతవకల వ్యవహారాల గురించి ఏం తెలియదు. సోరోస్, హిండెన్‌బర్గ్ వంటి కంపెనీలను తమ నివేదికలతో భారతీయ ఆర్థిక వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నాయి’’ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
‘‘హిండెన్‌బర్గ్ అదానీ కంపెనీ మీద రిసెర్చ్ చేయడంతో బిజీగా ఉంది కానీ పాపం వారి స్వంత దేశంలో ఎస్‌వీబీ దివాళ తీసింది.. ఇది హిండెన్‌బర్గ్ నిజాయతీ’’, ‘‘అంత తెలివైన హిండెన్‌బర్గ్ వారి స్వంత దేశంలో వెలుగు చూసిన ఎస్‌వీబీ అవకతవకలపై ఎందుకు నోరు మెదపడం లేదు. ఎస్‌వీబీ స్టాక్ కేవలం 2 రోజుల్లోనే పడిపోయింది’’, ‘‘అదానీ బతికి బయటపడ్డాడు కానీ ఎస్‌వీబీకి భారీ లిక్విడిటీ సమస్య ఉంది, మరి హిండెన్‌బర్గ్‌కు ఇది కనిపించలేదా’’ అంటూ నెటిజనులు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు.
హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ సంస్థల స్టాక్‌లలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఒకానొక దశలో 80 శాతం వరకు క్రాష్ అయ్యింది. అయితే, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ జీక్యూజీ ద్వారా ₹15,000 కోట్లకు పైగా మూలధన ఇన్ఫ్యూషన్ తర్వాత స్టాక్‌లు గత కొన్ని రోజులలో కొంత కోలుకున్నాయి. మరి ఎస్‌వీబీ వ్యవహారంలో హిండెన్ బర్గ్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hindenburg report missed to see books of “Silicon Valley Bank” (SVB) in very own country, but did hit Job on “Adani Business” in India.
It’s clear case of conspiracy, who would have got benefited politically?
— Cdr AA 🇮🇳 (@Veteran__007) March 12, 2023
Waiting for #Hindenburg to produce report on Silicon valley bank but they won’t because they can’t short it now. 😂#SiliconVallyBank #HindenburgReport @HindenburgRes
— Saurav Gupta (@SauravGupta7050) March 11, 2023
#hindenburg you BARKING DOG 🐶
Why are you so silent on Silicon Valley Bank fraud issue.
Do you see the real issue in in your own country #USA. Or you are just paid to bark on #India and Indian businesses like #Adani
By the way #AdaniSolidComeback is bringing India again on top pic.twitter.com/lntY7RlOsZ— Ketan Gandhi (@Ketangandhi_) March 11, 2023