దేశ వ్యాప్తంగా ఎంతో మంది కస్టమర్లను కలిగిన SBI సరికొత్త సర్వీసులతో కస్టమర్లకు సేవలను అందిస్తుంది. తాజాగా SBI తమ కస్టమర్లకు ఓ శుభవార్త తెలిపింది. బ్యాంకింగ్ సంస్థలు మారుతున్న టెక్నాలజీని అందుపుచ్చుకుని కస్టమర్ల అభిరుచి మేరకు కొత్త కొత్త ఆన్ లైన్ సేవలను అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే SBI తమ కస్టమర్లకు త్వరలో మరో సర్వీసుతో ముందుకు రానుందట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు ఎస్‌బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా.
ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ప్రియులకు భారీ షాక్.. పసిడిపై కేంద్రం సంచలన నిర్ణయం!
SBI వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందించబోతోందని, త్వరలోనే ఈ సేవలు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. ఇక అదే జరిగితే ఎస్‌బీఐ కస్టమర్లు చాలావరకు బ్యాంకు సేవల్ని వాట్సప్ ద్వారా పొందవచ్చని తెలుస్తోంది. వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని ఇప్పటికే మరికొన్ని బ్యాంకులు కస్టమర్ల ముందుకు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా SBI కూడా ఈ నిర్ణయం తీసుకోవడంతో కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. SBI నూతనంగా ప్రవేశపెట్టబోతున్న వాట్సప్ బ్యాంకింగ్ సేవలపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.