సాధారణంగా మనకు రిటర్న్స్ రావాలంటే ముందు మనం ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. మన పెట్టుబడికి అనుగుణంగా ఫలితాలు వస్తాయి.
కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా నెలకు ఒక లక్ష రూపాయలు రావు. అలాంటిది ఇక్కడ వన్ టైం రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి దాదాపు ప్రతినెల రూ. 75వేల నుండి రూ.90వేల వరకు సంపాదించవచ్చు. అదెలా అంటే ఈ బిజినెస్ ఎక్కడ సెటప్ చేయాలనుకుంటే నెలకు దాదాపు రూ.50,000 ల నుండి ఒక లక్ష వరకు సంపాదించవచ్చు. ఏ రిస్క్ లేకుండా 10 నుండి 20శాతం వరకు మీకు రిటర్న్స్ వస్తాయి. మరి అదెలా సాధ్యమవుతుందో చూద్దామా..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే తెలియని వారుండరు. ఇది ఒక జాతీయ బ్యాంక్. SBI కి భారతదేశం మొత్తంలో దాదాపు 50 వేల ఏటీఎంలు ఉన్నాయి. ఇటీవల ఎస్ బీఐ వైట్ లేబుల్ ఏటీఎం లు మొదలు పెట్టింది. అంటే ఎస్ బీఐ బ్యాంకు డైరెక్ట్ గా ఏటీఎం పెడితే దానిని SBI ATM అంటారు. ఓ ప్రైవేటు వ్యక్తిచే SBI ATM పెట్టబడితే దానిని SBI వైట్ లేబుల్ ఏటీఎం లు అంటారు. అంటే ప్రాంచేజీలా బ్యాంక్ ద్వారా తీసుకుంటారు. ఇలా ఏటీఎం లు నిర్వహించడం ద్వారా ప్రజల వరకు SBI సేవను విస్తరించుటకు అవకాశం కలుగుతుంది. SBI ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దీనికి దీనికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే KYC డాక్యుమెంట్లు కావలసి ఉంటుంది. SBI లో మీ యొక్క అకౌంట్ ఉండాలి. అకౌంట్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, NOC కలిగిఉండాలి. మీ సమీపంలో కమర్షియల్ ఏరియాలో 50 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. SBI ఏటీఎంకి ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ సంస్థలకు కూడా ఏటీఎం లు పెట్టుకోవచ్చని అనుమతులు జారీ చేసింది. SBI ప్రైవేటు వ్యక్తులకు ఏటీఎంలు ఇవ్వడం వల్ల స్వయం ఉపాధి కూడా పెరుగుతుంది. ఒక బిజినెస్ మొదలవుతుంది. మినిమం ఒకరోజు 300 ట్రాన్సాక్షన్స్ జరిగితే అంటే జనరల్ ఎంక్వైరీస్, క్యాష్ విత్ డ్రాలు జరిగితే నెలకు దాదాపు రూ. 45 నుండి రూ. 50 వేల వరకు వస్తుంది. ప్రతిరోజు 500 ట్రాన్సాక్షన్స్ జరిగితే నెలకు 90వేల రూపాయలు ఆదాయం వస్తుంది.