ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ, వాడకం కూడా బాగా పెరుగుతోంది. పర్యావరణానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు ఇస్తూ ఈవీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈవీ వాహనాల బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖర్చు గురించి నెట్టింట పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలితో పర్యావరణం ఎంతగానో దెబ్బతింటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పెరుగుతున్న వ్యక్తిగత వాహనాల వినియోగం వల్ల కూడా కాలుష్యం పెరుగుతోంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు కూడా ఇస్తోంది. పైగా రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ తగ్గింపులు అంటూ చాలానే సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈవీ వెహికిల్స్ వాడకం జోరందుకుంది. అయితే ఇప్పుడు ఈవీ స్కూటర్ వినియోగదారులు, కొనుగోలు చేయాలని చూసేవాళ్లకు నెట్టింట పిడుగులాంటి వార్త ఒకటి వైరల్ అవుతోంది.
ప్రభుత్వ ప్రోత్సాహం, పెట్రోల్- డీజిల్ ఖర్చు తగ్గుతుందని కూడా ఈ ఈవీ వాహనాల కొనుగోలు పెరిగింది. అయితే అంతా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయడం మాత్రమే ఖర్చు.. ఆ తర్వాత మినిమం ఖర్చుతో ఎంచక్కా వాహనం వాడేసుకోవచ్చు అనుకుంటున్నారు. అయితే తాజాగా ఓలాకి సంబంధించిన బ్యాటరీ ఖరీదు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తరుణ్ పాల్ అనే వ్యక్తి ఈవీ బ్యాటరీల ధరకు సంబంధించిన పోస్ట్ ఒకటి షేర్ చేశాడు. అందులో ధరలు చూసి ఈవీ వాహనదారులు నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే ఈ ఈవీ బ్యాటరీలు రీ ప్లేస్ చేయాలి అంటే మళ్లీ బండి కొన్నంత ఖర్చు అవుతోంది.
ఆ పోస్ట్ లో ఏం ఉంది అంటే.. ఓలా ఎస్1 వేరియంట్ బ్యాటరీ ధర రూ.66,549(3kwH), ఓలా ఎస్1 ప్రో బ్యాటరీ ధర రూ.87,298(4kwH)గా తెలిపాడు. ఈ ధరలు చూసి ఈవీ వాహనాలు ఉపయోగిస్తున్న అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మూడేళ్ల వరకు బ్యాటరీకి వారెంటీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది వస్తే కంపెనీ వాళ్లు ఫ్రీగా ఛేంజ్ చేస్తారు. అదే మూడేళ్ల తర్వాత బ్యాటరీ చెడిపోతే పరిస్థితి ఎంటి? అనే ప్రశ్నలు వేసుకుంటున్నారు. మరీ బ్యాటరీ రీప్లేస్ మెంట్ కి బండి కొన్న ఖర్చు అవుతోందనే గుబులు పట్టుకుంది. అయితే ప్రభుత్వాలు ఇస్తున్న ఈ సబ్సిడీల వల్ల 3kwh బ్యాటరీ రూ.75 వేలు పడాల్సింది కేవలం రూ.25 వేలకే వస్తోందని చెబుతున్నారు.
మీరు మూడేళ్ల తర్వాత మీ ఈవీ బ్యాటరీ చెడిపోయి రీప్లేస్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఆ సబ్సిడీ వర్తించదు. కాబట్టి మీరు ఆ బ్యాటరీని రూ.75 వేలు కొనాల్సి వస్తుందని చెబుతున్నారు. అంటే మీరు మార్చే బ్యాటరీ ఖర్చు మీరు కొన్న ఈవీ స్కూటర్ ధరలో 70 శాతం అనమాట. నిజానికి ఎప్పటినుంచో నిపుణులు, ఆటోమొబైల్ ఎక్స్ పర్ట్స్ ఈవీ బ్యాటరీల విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నారు. బండి ఖరీదులో బ్యాటరీల ధరే 70 శాతం ఉంటుందని చెబుతూనే ఉన్నారు. దిగుమతి కాకుండా.. స్వదేశంలోనే తయారీ పెరిగితే తప్పకుండా ఈవీ బ్యాటరీల రీప్లేస్మెంట్ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
Is it true?
Battery cost of ola S1 & ola S1 pro.
Ola S1 – 66549 /- Rs
Ola S1 pro – 87298 /- Rs.
if you want to beat the ICE vehicles in all aspects We will expect a better price & price drop in battery from ola electric after five years @OlaElectric @bhash @Khalidaaalbadri pic.twitter.com/Xr0rntQBhC— Mannu Bhardwaj (@gtfuturetechno) February 17, 2023