కష్టపడి డబ్బు సంపాదించడం ఒక రకమైతే.. తెలివిగా ఈజీ మార్గంలో సంపాదించడం మరో రకం. అందుకు ఆన్‌లైన్ ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు వీలవుతోంది. అదెలాగో తెలుసుకుందాం. అరుదైన కరెన్సీ నోట్లు, నాణేలను సేకరించే వారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అది ఎలాంటి అభిరుచి అంటే, కావాలనుకున్నప్పుడు రూపాయి నాణెం కోసం పదివేలు కూడా ఖర్చు చేయడానికి వెనుకాడరు. అయితే, ఆ నాణానికి అంత విలువ ఉండాలి మరి!. సాధారణంగా కరెన్సీ నోట్లపై నోట్ విలువ ప్రకారం రూ.5, రూ.10, రూ.20, రూ.100 ఇలా ఉంటాయని మనకు తెలుసు. వీటితోపాటూ.. మరికొన్ని నంబర్లు ఆ నోట్లపై ఉంటాయి. అవి నోట్ల సిరీస్ నంబర్లు. ఆ నంబర్లలో “786” ఉంటే.. మీ జేబులో లక్షల రూపాయలు పడ్డట్లే..!
కరెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ ఉన్న ‘786’ నోట్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. నిర్దిష్ట క్రమంలో కనిపించే ఈ మూడు అంకెలు నోటుతో దాదాపు రూ. 3 లక్షల వరకూ సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇస్లాం అనుసరించే వారు 786 సంఖ్యను శుభప్రదంగా పరిగణిస్తారు. కనుక, ఈ సీరియల్ నెంబర్ తో ఉన్న నోటు దొరికితే దాన్ని ఆన్ లైన్ లో వేలం వేయడం ద్వారా అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో కూడా సంపాదించొచ్చు. ప్రస్తుతం, eBay లాంటి మరికొన్ని ఇ-కామర్స్ వెబ్ సైట్లలో ప్రత్యేకమైన కరెన్సీ నోట్లు, నాణేలను అమ్మడానికి, కొనుగోలు చేయడానికి అనుమతులు ఉన్నాయి. కొందరు ఇలాంటి అరుదైన నోట్లను సోషల్ మీడియా వేదికగాను అమ్ముతున్నారనుకోండి. eBay చాలా కాలంగా ఉన్న ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ గనుక దాని బ్రాండ్ ఇలాంటి వాటి కోసం ప్రాధాన వేదికగా మారింది.
If you have a unique note with ‘786’ in the serial number, you can put it up for sale on e-commerce platforms like eBay and earn lakhs of rupees
Here’s all you need to know https://t.co/7ejwRA7eIp
— Mint (@livemint) September 4, 2021
ఒకవేళ మీ దగ్గర 786 సీరియల్ నంబర్ ఉన్న నోట్లు ఉంటే.. అమ్ముకోవాలని చూస్తుంటే.. ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి.
1: www.ebay.comకి వెళ్లండి.
2: హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్ ట్యాబ్ పై క్లిక్ చేసి, మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోండి.
3: మీరు విక్రయించాలనుకుంటున్న నోటును అప్లోడ్ చేయండి. అటువంటి నోట్ కోసం వెతుకుతున్న కొనుగోలుదారులకు eBay జాబితాలో మీ ఆఫర్ ను చూపుతుంది.
4: మీ ప్రకటనను చూసిన తర్వాత ఆసక్తిగల కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు ధరను ఖరారు చేసి వారికి నోటును అమ్మకోవచ్చు.
ఈబే మాత్రమే కాదు.. ఇలాంటి వెబ్‌సైట్లు మరికొన్ని ఉన్నాయి. ఆ వివరాలు.. https://indiancoinmill.com ఇందులో పాత నోట్లు, నాణేలను అమ్ముకోవచ్చు. అలాగే.. https://www.collectorbazar.com/indian-notes/ ఇందులో పాత నోట్లు, నాణేలతోపాటూ పాత స్టాంపులను కూడా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. Coinbazzar.com కూడా ఇలాంటిదే.అమ్మొచ్చు..కొనొచ్చు.