ప్రేమలో ఫెయిలయ్యి.. బుంగ మూతి పెట్టుకుని హర్ట్ అయ్యే అమ్మాయిలు, ప్రియురాలు మోసం చేసిందని గడ్డాలు పెంచేసి అబ్బాయిలు బాధపడకుండా ఉండడం కోసం కొన్ని కంపెనీలు ఇన్సూరెన్స్ లు ఇస్తున్నాయి. బ్రేకప్ అయినా, పార్ట్నర్ మోసం చేసినా మోసపోయిన వ్యక్తి ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి ఆ ఇన్సూరెన్స్ ఏంటో తెలిసేసుకోండి.
ఇన్సూరెన్సులనేవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ అని, మోటార్ ఇన్సూరెన్స్ అని, హోమ్ ఇన్సూరెన్స్ అని, ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఇలా రకరకాల ఇన్సూరెన్స్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే లవ్ బ్రేకప్ అయిన వారికి కూడా ఇన్సూరెన్స్ ఉందని మీకు తెలుసా? ప్రేమలో బ్రేకప్ అయితే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’ అనే ఇన్సూరెన్స్ స్కీం ఉంది. లవర్స్ అనేక కారణాలతో విడిపోవడం అనేది మనం చూస్తున్నాం. అయితే విడిపోయిన లవర్స్ కి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆదుకునేందుకు పలు ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని స్కీమ్స్ ని అందిస్తున్నాయి. వాటిలో ఈ హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఒకటి. అయితే ఈ ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటారు?
ఇటీవల ప్రతీక్ ఆర్యన్ అనే వ్యక్తి ప్రేమలో ఉండగా తన ప్రియురాలితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేంటంటే.. ప్రేమించుకునే సమయంలో పొరపాటున విడిపోతే ప్రేమలో మోసపోయిన వాళ్ళకి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’ పేరుతో డబ్బులు తీసుకోవాలన్న నిబంధన పెట్టుకున్నారు. దీని కోసం ప్రతీక్, అతని ప్రియురాలు ఇద్దరూ కలిసి ఒక బ్యాంక్ లో జాయింట్ ఖాతా ఓపెన్ చేశారు. ప్రతి నెల ఆ ఖాతాలో రూ. 1000 డిపాజిట్ చేస్తూ వచ్చారు. అయితే ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో నిబంధన మేరకు తనను మోసం చేసినట్టే అని ప్రతీక్ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకున్నాడు. అతనికి ఈ హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ నుంచి రూ. 25 వేలు వచ్చాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్.. ఆ ఇన్సూరెన్స్ వివరాలు మాకు కూడా చెప్పు గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇలాంటి ఇన్సూరెన్స్ లు కూడా ఉంటాయా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
I got Rs 25000 because my girlfriend cheated on me .When Our relationship started we deposited a monthly Rs 500 each into a joint account during relationship and made a policy that whoever gets cheated on ,will walk away with all money.
That is Heartbreak Insurance Fund ( HIF ).— Prateekaaryan (@Prateek_Aaryan) March 15, 2023
లవ్ బ్రేకప్ అయితే డిప్రెషన్, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే వారిని ఆదుకునేందుకు పయనీర్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు పని చేస్తున్నయి. ఈ పాలసీలు తీసుకున్న ప్రేమికులు బ్రేకప్ చెప్పుకున్నాక క్లెయిమ్ చేసుకుని నగదు పొందే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఈ ఇన్సూరెన్స్ బాగుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మగాళ్లతో డబ్బులు ఖర్చు పెట్టించి చింపుల్ గా మోసం చేసి బ్రేకప్ చెప్పేసి పోతే అమ్మాయిలు కట్టినటువంటి ఇన్సూరెన్స్ సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే అమ్మాయిలను మోసం చేస్తే అమ్మాయిలకే ఇన్సూరెన్స్ సొమ్ము వెళ్తుంది. మరి ఈ ప్రేమికుల కోసం ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తున్న సంస్థలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. అలానే ఇంకా ఏమైనా స్కీంలు పెడితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి సరదాగా.
You may not be able to save your family and loved ones from a heartbreak but you can help them start the healing process.
Get insured through Heartbreak PH 💜https://t.co/GFH6OkKVxi
— Pioneer Insurance (@PioneerPH) February 14, 2020