ఈ-కామర్స్ దిగ్గజం కంపెనీ అమెజాన్ సరికొత్త సమ్మర్ సేల్ ఆఫర్ తో మరోసారి ముందుకు వచ్చింది. మే 4 నుంచి స్టార్ట్ కాబోతున్న ఈ ఒక్క సేల్లో వంట సామాగ్రితో అప్గ్రేడ్ చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. అయితే ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సేల్లో భాగంగా తవా , ఫ్రైపాన్ , కడాయి వంటి కుక్వేర్ వస్తువులపై అమెజాన్ ఆఫర్స్ తీసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Google Pay, PhonePe: గూగుల్ పే, ఫోన్ పేలకు ఆదాయం ఎలా వస్తుందో మీకు తెలుసా?
హై- క్వాలిటీ ప్రొడక్ట్స్ పై 62% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా వర్తిస్తాయని కంపెని తెలిపింది. సోలిమో నాన్-స్టిక్ కడాయి కొంటే ఈ ఆఫర్ లో రూ.1,440 కాగా ఇప్పుడు ఇది రూ.819కి లభిస్తుంది. ఇదే కాకుండా సోలిమో స్మాల్ తడ్కా పాన్ మాములుగా ధర రూ.325 కాగా ఇప్పుడు దాని ధర రూ.239కి లభిస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. ఇక దీంతో పాటు సోలిమో అల్యూమినియం రోటీ తవా, సోలిమో ఇడ్లీ మేకర్ కమ్ మోదక్ మేకర్ వంటి సామాగ్రిలను 62% వరకు డిస్కౌంట్ తో పొందవచ్చు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.