తరచూ ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవారికి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తీపికబురు అందించింది. కస్టమర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈనెల 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్ ప్రారంభం కానుంది. 24వ తేదీన ముగియనుంది. ఈ సేల్ తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమై.. 48 గంటల పాటు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40 % వరకు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్ లు, రిఫ్రిజిరేటర్లు,ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచులు, క్లాతింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్.. ఇలా అన్నింటిపై 80 % వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రత్యేకత:
అమెజాన్ ప్రైమ్ డే.. ఈ పేరు బట్టే తెలిసిపోతుంది. ఈ సేల్ కేవలం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికే. అంటే.. ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఈ సేల్‌లో ఆఫర్లు పొందగలరు. ఈ ఏడాది ప్రైమ్ డే సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు ఆఫర్ ఉంది. ఈ కార్డులలు ఉపయోగించి ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తే 10 % అదనపు తగ్గింపు లభిస్తుంది.
ప్రైమ్ డే సేల్ డిస్కౌంట్లు:
స్మార్ట్‌ఫోన్‌లపై: ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40 % వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ పేర్కొంది. వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివోతో పాటు అన్ని కంపెనీల మొబైల్స్‌పై ఆఫర్లు ఉండన్నాయి.
ల్యాప్‌టాప్‌లపై: ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై 75 % వరకు డిస్కౌంట్ లభించనుంది. డెల్, లెనోవో, హెచ్‌పీ, ఆసుస్ తో పాటు పలు బ్రాండ్ల్ ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్లు ఉండన్నాయి.
రిఫ్రిజిరేటర్లపై: స్మార్ట్‌టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు లాంటి హోమ్ అప్లయన్సెస్‌పై 60 % వరకు ఈ సేల్‌లో డిస్కౌంట్లు ఉండనున్నాయి.
క్లాతింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్ పై: క్లాతింగ్, ఫుట్ వేర్, బ్యూటీ ప్రొడక్ట్స్ పై 80 % వరకు డిస్కౌంట్ లభించనుంది.
Amazon Prime day sale 23 – 24 July pic.twitter.com/9ZhalMl845
— Utsav Techie (@utsavtechie) July 6, 2022
మీరు కూడా ఈ సేల్ లో భాగస్వామ్యులు కావాలనుకుంటే.. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉండాలి. దాని కోసం అమెజాన్ ప్రైమ్‌కు సైన్ అప్ చేసుకోవాలి.
అమెజాన్ ప్రైమ్ కోసం సైన్ అప్ చేయడం ఎలా?
అమెజాన్ ప్రైమ్ డే సేల్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.