ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ కు సిద్ధమైంది. ప్రైమ్ డే సేల్ అనంతరం తన వార్షిక గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌కు తెరలేపింది. ఆగష్టు 6 నుంచి 10 వరకూ ఐదు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుండగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై 40 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే.. ఎస్‌బీఐ కార్డులపై పది శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.
బెస్ట్ సెల్లింగ్, పాపులర్ మొబైళ్లపై కూడా ఆఫర్లు ఉంటాయని అమెజాన్ తెలిపింది. వన్‌ప్లస్, షావోమీ, సామ్‌సంగ్, ఐకూ, రియల్‌మీ, యాపిల్‌తో పాటు దాదాపు అన్ని కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు ఉంటాయని టీజ్ చేస్తోంది. సేల్ దగ్గర పడుతున్న కొద్ది డీల్స్ వివరాలను వెల్లడిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అవకాశాన్ని అందిపుచ్చుకోలేని వారు ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌లో తక్కువ ధరకే తాము కోరుకున్న వస్తువులను కొనుగోలు చేయవచ్చు. రక్షా బంధన్ కూడా రానుండటంతో అమెజాన్ సేల్ కస్టమర్లకు మంచి అవకాశంగా భావించొచ్చు.
ఫోన్లు, ఇతర ప్రోడక్ట్స్‌పై అమెజాన్ సేల్‌లో నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లపైనా అమెజాన్ మెరుగైన డీల్స్, ఆఫర్లను అందిస్తోంది. హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకూ, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం, ట్యాబ్లెట్లపై 45 శాతం వరకూ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
Get ready guys
[Upcoming] Amazon Great Freedom Festival Sale | 6th – 10th August | 10% OFF with SBI Cardshttps://t.co/OcuGl2aVom pic.twitter.com/ubF4FsgiXS
— Govardhan Reddy (@gova3555) August 1, 2022
ఇదీ చదవండి: Upcoming Smartphones: ఆగష్టులో లాంచ్ కానున్న స్మార్ ఫోన్స్ లిస్టు ఇదే..!
ఇదీ చదవండి: అమెజాన్ బంపరాఫర్.. ఈ ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ.. ఆఫర్ వివరాలివే!