ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ దేశంలో 5జీ సేవలు మొదలుకానున్నాయి. స్పెక్ట్రం వేలం ముగియడంతో ఈ నెల 10 వరకు ఆయా సంస్థలకు టెలికాం సంస్థ ఆయా సంస్థలకు స్పెక్ట్రంను కేటాయించనుంది. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ 5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎరిక్సన్, నోకియా, శాంసంగ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు ఎరిక్సన్, నోకియాతో ఎయిర్‌టెల్ ఒప్పందం ఎప్పటినుంచో కొనసాగిస్తోంది. ఈ ఏడాది నుంచి శాంసంగ్‌తోనూ ఒప్పందం కొనసాగనుంది. ఇటీవల నిర్వహించిన 5జీ స్పెక్ట్రం వేలంలో 900MHz, 1800MHz, 2100MHz, 3300MHz, 26 GHz బ్యాండ్స్‌లో 19,867.8 MHZ స్పెక్ట్రంను రూ.43,084 కోట్లకు ఎయిర్‌టెల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ గోపాల్ ప్రకటించారు. 5జీ కనెక్టివిటీని వినియోగదారులకు అందించేందుకు ప్రపంచంలోనే పేరొందిన టెక్నాలజీ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 5జీ స్పెక్ట్రం వేలం 7 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 10 బ్యాండ్‌లలో మొత్తం 72,098 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి ఉంచగా.. 51,236 మెగాహెర్ట్జ్ (71 శాతం) మేర విక్రయమైందని, తొలి ఏడాది స్పెక్ట్రమ్ చెల్లింపుల కింద ప్రభుత్వానికి రూ.13,365 కోట్లు లభిస్తాయని కేంద్రం తెలిపింది. సాధ్యమైనంత వేగంగా 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జియో, ఎయిర్‌టెల్ ఆ రోజే ప్రకటించాయి. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. దేశంలో 5జీ టెక్నాలజీని ప్రజలు ఆదరిస్తారా? లేదా 4జీలోనే కొనసాగవుతారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
5G Spectrum auction ended, Jio emerged as the most agressive bidder followed by Airtel.#5G_Scam_Bjp pic.twitter.com/lOMG1UnYWR
— imran🥀 (@i_m_u_u) August 1, 2022
ఇదీ చదవండి: 5G Spectrum: ముగిసిన స్పెక్ట్రం వేలం.. అక్టోబర్ నుంచే 5G సేవలు..!