వైజాగ్ లో రియల్ ఎస్టేట్ బాగా నడుస్తున్న ఏరియాలో రూ. 15 లక్షలకే 300 గజాల స్థలం దొరుకుతుంది.
ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖపట్నం ఉంది. బాగా అభివృద్ధి చెందిన నగరంగా వైజాగ్ ఉంది. ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగా నడుస్తోంది. వైజాగ్ లో రియల్ ఎస్టేట్ బాగున్నా ఏరియాల్లో సబ్బవరం ఒకటి. ఆనందపురం, అచ్యుతాపురం, భీమిలి, భోగాపురం, మధురవాడ, పెందుర్తి, తగరపువలస వంటి ఏరియాల్లో గజం రేట్లు రూ. 11 వేలకు తక్కువ లేవు. వైజాగ్ లోని ఈ ప్రాంతాల్లో స్థలం కొనాలంటే గజం రూ. 11 వేల నుంచి రూ. రూ. 40 వేల మధ్యలో ఉన్నాయి. అయితే సబ్బవరం, కొత్తవలస ప్రాంతాల్లో మాత్రం తక్కువ ధరకు స్థలం దొరుకుతుంది. ఈ ఏరియాలో గజం రూ. 5,000 నుంచి రూ. 9,900 మధ్యలో ఉంది. సగటు ధర రూ. 7,500 ఉంది. సబ్బవరంలో గజం రూ. 5 వేలు ఉన్న స్థలాలు, రూ. 7,500 ఉన్న స్థలాలు, రూ. 9,900 ఉన్న స్థలాలు ఉన్నాయి.
గరిష్ట ధర, కనిష్ట ధర, సగటు ధర ఇలా ఆయా లొకేషన్స్ ని బట్టి ధరలు ఉన్నాయి. తక్కువ ధర పలికే చోట గజం రూ. 5 వేలు ఉంది. 300 గజాల స్థలానికి రూ. 15 లక్షలు అవుతుంది. అదే 150 గజాల స్థలానికైతే రూ. 7.5 లక్షలవుతుంది. సగటు ధర ప్రకారం అయితే గజం రూ. 7,500 చొప్పున 300 గజాలకు రూ. 22,50,000 అవుతుంది. అదే 150 గజాలకు ఐతే రూ. 11,25,000 అవుతుంది. గరిష్ట ధర ప్రకారం గజం రూ. 9,900 చొప్పున 300 గజాలకు రూ. 29,70,000 అవుతుంది. 150 గజాల స్థలమైతే రూ. 14,85,000 అవుతుంది. గతంలో ఈ రేట్లు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు తగ్గాయి. ఈ ఏరియాలో చదరపు అడుగు కనిష్టంగా రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 4,400 ఉంది. సబ్బవరం చదరపు అడుగు రూ. 722 చొప్పున 1800 చదరపు అడుగుల స్థలం రూ. 13 లక్షల నుంచి మొదలవుతుంది.
అంటే 200 గజాల స్థలం రూ. 13 లక్షలకే వస్తుంది. ఇంకో రూ. 2 లక్షలు కలుపుకుంటే రూ. 15 లక్షలకే 300 గజాల స్థలం దొరుకుతుంది. వైజా300 గజాలు అంటే 6 సెంట్లు. 6 సెంట్లలో డూప్లెక్స్ హౌజ్ కట్టుకోవచ్చు. వైజాగ్ లోని ప్రధాన ఏరియాల్లో ఇంతకంటే తక్కువ బడ్జెట్ లో మరెక్కడా కూడా స్థలాలు దొరకడం లేదు. పైనా ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగుంది. గత పదేళ్లలో సబ్బవరం ల్యాండ్ రేట్లు 42.9 శాతం పెరగగా.. ఐదేళ్ళలో రూ. 33.3 శాతం పెరిగింది. గత ఏడాదిలో రూ. 17.6 శాతం పెరిగింది. కాబట్టి ఈ ఏరియాలో స్థలం మీద పెట్టుబడి పెట్టడం అన్నది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.