హైదరాబాద్ కి అతి దగ్గరలో 2 బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ కేవలం రూ. 55 లక్షలకే దొరుకుతుంది. ఈ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ దొరకడం చాలా కష్టం. ఉప్పల్, ఎల్బీ నగర్ ఏరియాలకు 15, 20 కి.మీ. దూరంలో ఉంది.
హైదరాబాద్ లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే కోటి, రెండు కోట్ల పై మాటే. ఇది కొనలేకే చాలా మంది ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు. స్థలం రాకపోయినా అద్దె బాధ ఉండదని ఆలోచిస్తున్నారు. అయితే హైదరాబాద్ కి 25 కి.మీ. దూరంలో రూ. 55 లక్షల బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ వస్తుందంటే నమ్ముతారా? అవును రూ. 55 లక్షల బడ్జెట్ లో బ్రహ్మాండమైన 2 బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. అది కూడా బిల్డర్ హౌస్ కాదు, బ్రోకర్ల హౌస్ అంతకంటే కాదు. డైరెక్ట్ ఓనర్ హౌసే. 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే ఎంత కాదన్న హైదరాబాద్ సిటీలో కనీసం 40, 50 లక్షలు పెట్టుకోవాలి. ఈ బడ్జెట్ పెట్టగలిగితే హైదరాబాద్ కి దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది కదా.
ఇదే డిస్టెన్స్ లో ఉన్న మియాపూర్ లో స్థలం కొనాలంటే చదరపు అడుగు రూ. 10 వేల పైనే ఉంది. 2 బీహెచ్కే ఇండిపెండెంట్ ఇల్లు కొనాలంటే రూ. కోటి నుంచి కోటిన్నర, రెండు కోట్ల వరకూ పెట్టుకోవాలి. ఇక 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే కనీసం 50 లక్షల నుంచి 90 లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది. స్థలం వస్తుందా అంటే రాదు. పోనీ ఫ్లాట్ విలువ ఏమైనా పెరుగుతుందా అంటే పెద్దగా పెరగదు. మీరు పెట్టిన పెట్టుబడికి న్యాయం జరగాలంటే స్థలం మీద పెట్టుబడి పెట్టాలి. రూ. 55 లక్షలు పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలు చేస్తే ఇందులో ఓ రూ. 30 లక్షలు నిర్మాణానికే పోయినా, మిగతా రూ. 25 లక్షలు స్థలం మీద పెట్టుబడి పెట్టినట్టు. స్థలం మీద ఇప్పుడు రూ. 25 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా పెరుగుతుంది.
హైదరాబాద్ నుంచి కోహెడ 25 కి.మీ. దూరంలో ఉంది. మియాపూర్ కూడా హైదరాబాద్ కి ఇదే దూరంలో ఉంది. 50 లక్షలు పెట్టి స్థలం రాని ఫ్లాట్ కొనడం కంటే.. కోటి, కోటిన్నర, రెండు కోట్లు పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కొనడం కంటే రూ. 55 లక్షల బడ్జెట్ లో కోహెడలో 2 బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడం మేలు. ఈ ఏరియాలో రూ. 50 లక్షలు, రూ. 55 లక్షలు, రూ. 60 లక్షల బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ లు ఉన్నాయి. ఏరియా వచ్చేసి 1200 చదరపు అడుగులు వస్తుంది. 3 బీహెచ్కే కావాలంటే రూ. 80 లక్షలు అవుతుంది. 4 బీహెచ్కే అయితే కోటిన్నర అవుతుంది. కోహెడ నుంచి ఎల్బీ నగర్, ఉప్పల్ ఏరియాలు 15, 20 కి.మీ. దూరంలో ఉన్నాయి.
సిటీకి బాగా దూరం అని బాధపడాల్సిన పని లేదు. ఒకవేళ స్థలం కొనాలనుకున్నా కానీ కొనుక్కోవచ్చు. కోహెడలో సగటున చదరపు అడుగు రూ. 1700 పలుకుతోంది. 1700, 1800, 2000 లోపు ఉంది. 1000 చదరపు అడుగుల స్థల కొనాలంటే రూ. 17 లక్షల నుంచి రూ. 20 లక్షలు అవుతుంది. ఇంటి నిర్మాణానికి ఓ 25 నుంచి 30 లక్షలు పెట్టుకున్నా కూడా రూ. 42 లక్షల నుంచి రూ. 50 లక్షల బడ్జెట్ లో ఇల్లు అనేది పూర్తి చేసుకోవచ్చు. స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నదానికి, కట్టిన ఇల్లు కొనుక్కోవడానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది.
గమనిక: మాకు దొరికిన డేటా ఆధారంగా కోహెడ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్, స్థలాల ధరలు ఇవ్వడం జరిగింది. ఈ ధరల్లో మార్పులు అనేవి ఉంటాయి. ఇల్లు, స్థలం కొనే ముందు రియల్ ఎస్టేట్ నిపుణుల సలహాలు, సూచనలు పాటించవలసిందిగా మనవి. పై కథనం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం ఇవ్వబడింది. ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టడం పూర్తిగా మీ బాధ్యత మాత్రమే.