బిగ్ బాస్ ఓటీటీ మొదలైందో లేదో.. వివాదాలు కూడా అప్పుడే ఆర్జం పోసుకున్నాయి. మొదటి నుంచి బిగ్ బాస్ విషయంలో తరచూ సీపీఐ నారయణ తనదైనశైలిలో స్పందిస్తూనే ఉంటారు. తాజాగా బిగ్ బాస్ షోపై కాస్త ఘాటుగానే స్పందించారు. ‘బిగ్ బాస్ ఒక సర్టిఫైడ్ బ్రోతల్ హౌస్’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఓవైపు మద్దతు లభిస్తోంది. మరోవైపు వ్యతిరేకత కూడా వస్తోంది. ఆయన వ్యాఖ్యలపై ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి స్పందించింది.
ఇదీ చదవండి: Bigg Boss OTT పై నారాయణ ఫైర్! ఈసారి ఏకంగా బూతులే!
తమన్నా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కు వెళ్లొచ్చాక ఆమె జీవితం ఎంతో మారిపోయింది. సమాజంలో గుర్తింపు కూడా పెరిగింది. అదే కృతజ్ఞతా భావంతో తమ్మన్నా సీపీఐ నారాయణ మాటలను ఖండించింది. కాకపోతే కాస్త తీవ్రంగా స్పందించింది. సీపీఐ నారాయణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా సింహాద్రి ‘నారాయణను చెప్పుతో కొట్టాలి’ అంటూ తీవ్రంగా స్పందించింది.
బిగ్ బాస్ వల్లే తమలాంటి ఎంతో మందికి గుర్తింపు లభించిందని. దాని వల్లే వారికి ఉపాధి దొరికిందని తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా సింహాద్రి వ్యాఖ్యలు దుమారం రేపాయి. నారాయణలాంటి వ్యక్తిని ఆమె అలా మాట్లాడటాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. తమన్నా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.