‘బిగ్ బాస్ ఓటీటీ తెలుగు’ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాన్ స్టాప్ అంటూ బుల్లితెర ప్రేక్షకులను ఫోన్లకు కట్టిపడేస్తున్నారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ బాగా క్లిక్ అయ్యింది. ఏ టాస్కు ఇచ్చినా, ఏ విషయం ఉన్నా కూడా అది వారి మధ్య యుద్ధంలా సాగుతోంది. ప్రతి విషయంలో పంతం నీదా నాదా సై అనేలా ఉంటున్నాయి సంఘటనలు. తాజాగా ఓ టాస్కు విషయంలో మొదలైన మాటలు నటి తేజశ్వి గుక్కపెట్టి ఏడ్చేలా చేశాయి. టాస్కు గెలిచిన వారు అవతలి టీమ్ సభ్యులకు పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: Bigg Boss Telugu OTT: నామినేషన్స్ లో సరయు, యాంకర్ శివల మధ్య వార్!
అలా పనిష్మెంట్ విషయంలో ఆర్జే చైతు- బింధు మాధవి, తేజశ్విల మధ్య మాటల యుద్ధం జరిగింది. టాస్కు గెలిచిన ఆనందంలో తేజశ్వి ఛాలెంజర్స్ దగ్గరకు వచ్చి వారిని టీజ్ చేయాలని చూస్తుంది. అప్పటికే రివర్స్ ప్లాన్ తో సిద్ధంగా ఉన్న ఆర్జే చైతు- బింధు పాత టాస్కుకు సంబధించి మీకు పనిష్మెంట్ బాకీ ఉంది వంట మొత్తం మీరే చేయండి అంటారు. ఆ మాటలకు తేజశ్వి హర్ట్ అయ్యింది. మేము గెలిచాం కదా మీరు ఎలా పనిష్మెంట్ ఇస్తారు అంటూ ప్రశ్నించింది.. తెలిజెప్పే ప్రయత్నం చేసింది. కామన్ బిగ్ బాస్ హౌస్ లో ఎదుటివారి మాటలు ఎవరూ వినరు అదే జరిగింది అక్కడ కూడా.
వారి మాటలతో హర్ట్ అయిన తేజశ్వి.. వారి పనిష్మెంట్ తీసుకునేందుకు సిద్ధమైంది. ఏడ్చేసుకుంటూ ఇంట్లోని వారియర్స్ అందరికీ ఓడిపోయిన ఛాలెంజర్స్ కు మరో శిక్ష వేయాలంటూ సూచిస్తుంది. అసలు వారియర్స్ ఎవరూ పని ఆపకండి మనమే వాళ్లకి చేసి పెడదాం అంటూ కెప్టెన్ గా వారియర్ గా ఆర్డర్స్ పాస్ చేస్తుంది. నటరాజ్ మాస్టర్ ఛాలెంజర్స్ కు అరగంట పాటు మూడు కోతుల తీరులో కూర్చోమని చెబుదామంటూ సూచించారు. హౌస్ లో ఏ చిన్న మాట అయినా, టాస్క్ అయినా కూడా ఎండ్ రిజల్ట్ మాత్రం ఎవరో ఒకరి ఏడుపుతోనే, గొవడతోనే ముగుస్తూ కనిపిస్తోంది. వారిలో వారు కొట్టుకుంటూ ప్రేక్షకులను మాత్రం బాగానే ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఆర్జే చైతు, తేజశ్వి, బింధుల వార్ లో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.