Dil Raju: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవలే దిల్ రాజు, ఆయన సతీమణి వైఘారెడ్డి దంపతులకు మగబిడ్డ జన్మించిన విషయం విదితమే. ప్రస్తుతం పుత్రోత్సాహంతో ఉన్న దిల్ రాజు.. ఫ్యామిలీలో వారసుడు ఎంట్రీ ఇచ్చిన ఆనందం వెల్లివిరిసింది. తాజాగా వారసుడికి నామకరణ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. కొన్నేళ్ల క్రితమే దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించారు. ఇక మొదటి భార్య అనిత పేరు నుండి మొదటి రెండు అక్షరాలు, రెండో భార్య వైఘారెడ్డి పేరు నుండి రెండు అక్షరాలను కలుపుతూ.. దిల్ రాజు తన బిడ్డకు పేరు పెట్టినట్లు తెలుస్తుంది. ఇంతకీ బాబు పేరేంటంటే.. అన్వై రెడ్డి అని సమాచారం.
ఇక 52 ఏళ్ల దిల్ రాజు, 29 ఏళ్ల వైఘారెడ్డి ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్నారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించింది. ఆయన కుమార్తె హన్షిత.. రెండో పెళ్లి చేసుకోవాలని కోరడంతో తేజస్వి(వైఘా రెడ్డి)ని 2020 మే నెలలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు వారసుడికి ఏం పేరు పెడతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. మొత్తానికి దిల్ రాజు దంపతులు తమ కుమారుడికి అన్వై రెడ్డి అని పేరు పెట్టారు. ఈ విషయం తెలిసిన సినీప్రియులు, ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ, దళపతి విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ద్విభాషా చిత్రం వారసుడు, నాగచైతన్య హీరోగా థాంక్యూతో పాటు పలు చిత్రాలు పట్టాలెక్కనున్నాయి. ఇప్పుడైతే దిల్ రాజు వారసుడి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దిల్ రాజు వారసుడి పేరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Ace Producer Dil Raju and his wife Vygha Reddy became proud parents to a baby boy on Wednesday. They were blessed with their first child, a baby boy.
Congratulations #DilRaju garu & #Vygha ❤️#Tollywood #telugucinema #filmupdates #movieupdates #tollywoodupdates #filmysense pic.twitter.com/Tw77tQwJIT
— FilmySense (@FilmySense) June 29, 2022