ఈ మధ్యకాలంలో గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తున్న సెలెబ్రిటీలు చాలామందే ఉన్నారు. అయితే.. సినిమాలలో, ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ లో గ్లామర్ ఒలికించారంటే మామూలే. కానీ.. మొదట నీట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించిన యాంకర్లు.. ఇప్పుడు ఫోటోషూట్స్ తో అందాల ఆరబోతలో రెచ్చిపోతున్నారు. మొన్నటివరకూ యాంకర్ విష్ణుప్రియను చూసి మైండ్ పోయిందన్న నెటిజన్స్.. కొంతకాలంగా మరో యాంకర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ యాంకర్ ఎవరో కాదు బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు.
యూట్యూబ్ ఛానల్స్ లో ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి.. పలువురు పాపులర్ సెలబ్రిటీలతో పాటు డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూలు చేసి పాపులారిటీ దక్కించుకుంది. అలా వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకొని పలు టీవీ షోలలో పాల్గొని.. మొత్తానికి బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ ద్వారా యూత్ కి బాగా దగ్గరైన స్రవంతి.. హౌస్ నుండి బయటికి వచ్చాక మళ్లీ తన యాంకరింగ్ ని కంటిన్యూ చేస్తోంది.
ఈ క్రమంలో స్రవంతి గ్లామర్ షోలో హద్దులు పూర్తిగా చెరిపేసిందనే చెప్పాలి. ఇదివరకు క్లాస్, డీసెంట్ లుక్ లో ఫోటోషూట్స్ చేసిన స్రవంతి.. ఇప్పుడు ఏమాత్రం మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ అందాలను కెమెరా ముందుంచి ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా వైట్ షర్ట్ ధరించి బెడ్ పై చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. హోటల్ బెడ్ రూమ్ లో భర్తతో కలిసి రొమాన్స్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి స్రవంతి లేటెస్ట్ బోల్డ్ ఫోటోలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.