‘బిగ్ బాస్ ఓటీటీ’ రచ్చ షురూ అయిపోయింది. బుల్లితెర ప్రేక్షకులు ఫోన్లకు అతుక్కుపోయారు. హిందీ ఓటీటీకి భిన్నంగా తెలుగులో తొలిసారి.. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అంటూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారి బిగ్ బాస్ మాజీ సభ్యులను కూడా ఇంట్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈసారి అమ్మాయిల హవా ఎక్కవగా కనిపిస్తోంది. హౌస్ లో మొత్తం 10 మంది లేడీ సభ్యులు ఉన్నారు. తొలిరోజు నుంచి వారు హంగామా మొదలు పెట్టేశారు.
ముఖ్యంగా యాంకర్ శివను ర్యాగింగ్ చేస్తూ ఎక్కువగా కనిపించారు. ఓ డిస్కషన్ లో అయితే యాంకర్ శివను స్రవంతి చొక్కారపు ఫుల్ ర్యాగింగ్ చేస్తూ కనిపించింది. ఉదయాన్నే అందరూ స్నానాలు చేశాం. నేనైతే ఫ్రెష్ అంటూ శివ అనడంతో.. ‘యాంకర్ శివ ఫ్రెష్ అంటే నేను నమ్మను’ అంటూ ద్వంద్వార్థంలో సెటైర్లు వేసింది. ఇంక సీనియర్లు అయితే దొరికినప్పుడల్లా జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారు. మొదటిరోజే బిగ్ బాస్ కూడా అమ్మాయిలతో అబ్బాయిలను ర్యాగ్ చేయించాడు. వినోదం పంచడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఒక అడుగు ముందున్నట్లు కనిపిస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీలో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.