బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రసవత్తరంగా మారుతోంది. లాస్ వీక్ కెప్టెన్‌గా అవతరించిన ఇనయా సుల్తానా డ్యూటీ ఎక్కేసింది. అయితే 12వ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తారా అని అంతా ఎదురుచూశారు. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పుణ్యమాని ఎలిమినేట్ కావాల్సిన ఫైమా సేవ్ అయ్యింది. ప్రేక్షకులు సేవ్ చేసిన రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని రాజ్ కోసం ఉపయోగిస్తానంటూ చెప్పుకొచ్చింది. కానీ, రాజ్ దానికి అంగీకరించలేదు. తనకోసం కూడా వాడుకోవడానికి ఫైమా ఇష్టపడలేదు. కానీ, ఎందుకు వృథా పోనివ్వాలి.. మీ అమ్మ ఏం చెప్పారు అంటూ ఫైమాని కన్విన్స్ చేశారు. మొత్తానికి ఫైమా సేవ్ కాగా.. రాజ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు.
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి సభ్యుడు బిగ్ బాస్ స్పెషల్ ఇంటర్వ్యూకి హాజరవుతారు. అలాగే మోడల్ రాజ శేఖర్ కూడా యాంకర్ శివ హోస్ట్ గా నిర్వహిస్తున్న బీబీ కెఫేకి వెళ్లాడు. అక్కడ యాంకర్ శివ రాజ్‌ని ఇంటర్వ్యూ చేయాల్సింది పోయి అతడిని అవమానించడం మొదలు పెట్టాడు. రాజ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఒక ఇంటి సభ్యుడు. అతను హౌస్‌లో 12 వారాలపాటు ఉండి వచ్చాడు. ‘70 కెమెరాలు తప్పించుకుని భలే ఆడాడు అయ్యా అతను’ అని ఎవరో గెస్ట్ చెప్పారు అంటూ చీప్ జోక్ ప్లే చేశాడు. రాజ్ కంప్లీట్ లక్కుతోనే 12 వారాలు కొనసాగాడు అంటూ యాంకర్ శివ కామెంట్ చేశాడు. బిగ్ బాస్ హౌస్‌కి లక్‌తోని వచ్చావ్ అంటూ ఎటకారం చేశాడు.
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరూ లక్ మీద రారు అంటూ రాజ్ అంటుంటే.. ఎవరూ రారు.. కానీ, నువ్వు వొచ్చావ్.. నక్క తోక తొక్కి అంటూ అతడి గేమ్‌ని తీసేసి మాట్లాడాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ట్రై చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. ఎందుకు ట్రై చేయలేదని అడగ్గా.. అప్పటికే రూ.5 లక్షలు వాడేశాను. అందుకే ట్రై చేయలేదంటూ రాచ్ క్లారిటీ ఇచ్చాడు. అప్పుడు అది చేయకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడివి కాదుగా అని చెప్పాడు. నాకు ఎలాంటి బాధ లేదు.. నేను హ్యపీగానే ఉన్నానంటూ హాచ్ చెప్పుకొచ్చాడు. అవునులే ఏం ఆడకుండా 12 వారాలు ఉంటే హ్యాపీగానే ఉంటుంది బ్రో అని మళ్లీ తనదైనశైలిలో చీప్ జోక్‌ని వేశాడు. ఇప్పుడు యాంకర్ శివ ఇంటర్వ్యూ, అతని మాట తీరు, రాజ్‌ని కించపరచడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.
మోడల్ రాజ్ శేఖర్ లైఫ్‌లో ఎన్నో స్ట్రగుల్స్ పడి ఈ స్థాయికి వచ్చాడు. అతను లైఫ్‌లో ఏ కష్టం పడకుండా ఇక్కడి దాకా వచ్చిన వ్యక్తి కాదు. బిగ్ బాస్ హౌస్‌లో రాజ్ తాను బయట ఎలా ఉంటాడో లోపల కూడా అలా ఉండేందుకే ట్రై చేశాడు. అది ప్రేక్షకులకు నచ్చింది కాబట్టి ఇన్ని వారాలు హౌస్‌లో ఉంచారు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. రాజ్‌ని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదు.. ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల రాజ్ బయటకు వచ్చాడు. అంటే ఈ వారం కూడా రాజ్ హౌస్‌లో ఉండేవాడు. అలాంటి ప్లేయర్‌ని పట్టుకుని నువ్వు ఏం ఆడకుండా ఇన్నాళ్లు ఉన్నావ్, 70 కెమెరాలను తప్పించుకుని ఆడావ్.. అంటూ యాంకర్ శివ కామెంట్ చేయడం ఎవరిని కించపరుస్తున్నాడో అర్థం కావడం లేదు. అంటే ఇన్నాళ్లు అతడికి ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులను తక్కువ చేసి మాట్లాడినట్లు అనిపిస్తోంది. కాంట్రవర్సీ ఇంటర్వ్యూలతో పైకొచ్చిన శివకి.. కష్టపడి పైకొచ్చినోడి విలువ తెలియాలి అనుకోవడం కూడా మూర్ఖంత్వంలే అంటూ కామెంట్ చేస్తున్నారు.
12 వారాలు హౌస్‌లో తనని తనలా ప్రెజెంట్ చేసుకుని, జీవో నెగెటివిటీతో బయటకు వచ్చిన రాజ్ గురించి యాంకర్ శివ అంత చీప్‌గా మాట్లాడటం, మళ్లీ తాను వేసిన కుళ్లు జోకులకు తానే నవ్వుకోవడం చూసి.. ఎందుకు బ్రో నీకు అంత బలుపు అంటూ మోడల్ రాజశేఖర్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. అందరూ నీకులా నోరెసుకుని పడిపోయి.. గొడవలు పడాలి అంటే అవ్వదు కదా? కొందరు మంచి వాళ్లు ఉంటారు. వాళ్లని మంచిగానే ఉండనివ్వు.. నీకులా మార్చేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అంటూ బుద్ధి చెబుతున్నారు. బిగ్ బాస్ అనేది వ్యక్తిత్వాన్ని రిప్రెజెంట్ చేసే గేమ్ షో అని రాజ్ అంటే.. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో అంటూ శివ తన వెర్రితనాన్ని బయటేశాడు. నిజానికి బిగ్ బాస్ అనేది నీ క్యారెక్టర్‌ని రిప్రెజెంట్ చేసే రియాలిటీ గేమ్ షో. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వెళ్లి, బీబీ కెఫే అని షో నిర్వహిస్తూ.. బిగ్ బాస్ గురించి తెలియకుండా ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నావా మావా బ్రో అంటూ యాంకర్ శివని ఎటకారం చేస్తున్నారు. యూట్యూబ్‌లో రాజ్ ఒక మంచి ఆటగాడు, మంచి ఇంటి సభ్యుడు, మంచి వ్యక్తి అంటూ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.