గీతూ రాయల్ అంటే గేమ్.. గేమ్ అంటే గీతూ రాయల్ అని మంచి టాక్ వచ్చింది. కానీ, తొమ్మిదో వారమే గీతూ రాయల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. నిజానికి ఈ ఎలిమినేషన్‌ని అటు గీతూ రాయల్ మాత్రమే కాదు.. ఇటు ప్రేక్షకులు సైతం నమ్మలేకపోయారు. మినిమం టాప్-5 కంటెస్టెంట్‌గా గీతూ రాయల్‌ని భావించారు. కానీ, ఆమె ఇలా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి వచ్చేసింది. ఎలిమినేషన్ వార్త విన్న దగ్గరి నుంచి గీతూ రాయల్ మనసు ముక్కలైంది. ఇంట్లో నుంచే ఏడుస్తూ స్టేజ్ మీదకు వచ్చింది. స్టేజ్ మీద కూడా ఏడుస్తూనే ఉంది. అందిరి గురించి మాట్లాడుతూ కూడా ఏడుస్తూనే ఉంది. అలాగే ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. యాంకర్ శివకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా గీతూ ఏడుపు ఆపలేదు.
అది చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్థమైనట్లు ఉంది. గీతూ రాయల్‌కు బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో? బిగ్ బాస్ ఆమె ఎమోషన్ అని అందరికీ అర్థమైంది. కానీ, ఏం లాభం ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయట ఉన్నాక. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ బిగ్ బాస్. తలుపు తీయకండి నేను బయటకు రాను.. అంటూ గీతూ గుక్క పట్టి ఏడ్చింది. నాకు మళ్లీ లైఫ్ ఇచ్చావ్ బిగ్ బాస్ అంటూ సెట్‌లో కిందకూర్చుకుని ముద్దు పెట్టుకుని ఏడ్చేసింది. ఇంటర్వ్యూలో ఇంత త్వరగా ఎందుకు వచ్చేశావ్ అని అడగ్గానే బాగా ఎమోషనల్ అయిపోయింది. నేను నిజంగా ఇంత త్వరగా వస్తాను అనుకోలేదు అంటే ఏడ్చింది.
యాంకర్ శివ కూడా ప్రేక్షకుల తరఫున చాలా ప్రశ్నలు అడిగాడు. “బాలాదిత్య విషయంలో చేసిన ఆ చిన్నతప్పుతోనే నేను బయటకు వచ్చేశానని నేను అనుకోను. నేను టాప్- 5 అని కూడా అనుకోలేదు. నాకు నిద్రలో కూడా బిగ్ బాస్ గెలవాలి అనే ఉండేది. నేను బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ అనే ఫిక్స్ అయిపోయాను. కానీ, ఇంత త్వరగా వచ్చేస్తానని అనుకోలేదు. అసలు అలా ఎందుకు జరిగిందే నాకు అర్థం కాలేదు” అంటూ ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఓ పోస్ట్ పెట్టింది. “బిగ్ బాస్‌లో గడిపిన క్షణాలను నా లైఫ్‌లో చాలా ప్రత్యేకం. కానీ, అందులో నేను ఓడిపోయాను. నాకు మనుషుల విలువ తెలిసొచ్చింది. నా తప్పులని క్షమించండి ప్లీజ్. నన్ను నన్నుగా అర్థం చేసుకుని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చనిపోయే వరకు రుణపడి ఉంటాను. మై వాట్చ్ స్టాప్స్ హియర్” అంటూ గీతూ రాయల్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.