బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎంత నటించినా.. నిజస్వరూపాలన్నీ కొద్ది రోజులకే బయటపడుతుంటాయి. ఎందుకంటే.. బిగ్ బాస్ దగ్గర నటించినా షో చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఈజీగా దొరికిపోతుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటిషో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాతవాళ్లు, కొత్తవాళ్లు కలిపి 17 మంది పాల్గొన్నారు.
బిగ్ బాస్ లో అడుగుపెట్టాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందేగా.. టాస్కులు మొదలవగానే పోటీ మొదలవుతుంది. ఆ వెనకే ఇగో, పాత కక్షలు అన్ని.. నామినేషన్స్ లేదా వోటింగ్ టైంలో బయటపడతాయి. ఇటీవల హౌస్ లో ఇద్దరి మధ్య గేమ్ కాస్తా సీరియస్ అయిపోయి.. పాత పగల కారణాలతో ఆరోపించుకునే స్థాయికి చేరుకుంది. నగ్నం బ్యూటీ శ్రీరాపాక పై ముమైత్ ఖాన్ పగ తీర్చుకుంటుందని అంటోంది.శ్రీరాపాక పై హౌస్ లో చాలామంది టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. నటరాజ్ మాస్టర్, అరియానా, అఖిల్, తేజస్వి, ముమైత్ ఇలా జాబితా పెద్దగానే ఉన్నట్లుంది. గేమ్ లో నెగెటివ్, పాజిటివ్ వైబ్స్, థమ్స్ అప్, థమ్స్ డౌన్ సింబల్స్ అన్ని శ్రీ రాపాకకు పెట్టేశారు. అందులోను ఎక్కువగా థమ్స్ డౌన్ ఉండటం గమనార్హం. దీంతో శ్రీరాపాక కంటతడి పెట్టుకొని అందరూ తనను అబద్దాలకోరుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ముమైత్ ఖాన్.. ఓ డాన్స్ షోలో జరిగిన వివాదం గుర్తు పెట్టుకొని తనపై కక్ష సాధిస్తుందని ఏడ్చేసింది. మరి బిగ్ బాస్ లో రోజురోజుకూ ఒక్కొక్కరి స్వభావం బయట పడుతోంది. మరి శ్రీ రాపాక పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.