తెలుగు టీవీ ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బిగ్ బాస్ రియాలిటీ షో రెడీ అయిపోయింది. ఇప్పటివరకు 5 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇకపై OTT లో ప్రారంభం కాబోతుందని అందరికి తెలిసిందే. అయితే.. బిగ్ బాస్ OTT వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి బిగ్ బాస్ టీమ్ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బిగ్ బాస్.. ప్రస్తుతం ఆదరణలో గానీ, టీఆర్పీ రేటింగ్ లో మొదటి స్థానం సంపాదించుకుంది. బిగ్ బాస్ ఓటిటి తెలుగు వెర్షన్.. డిస్నీ హాట్ స్టార్ లో 24 గంటలు ప్రసారం కాబోతుంది. 82 రోజులపాటు సాగనున్న ఈ బిగ్ బాస్ ఓటిటి షో ఫిబ్రవరి 26 నుండి మొదలు కానుందని లేటెస్ట్ ప్రోమో ద్వారా ప్రకటించింది బిగ్ బాస్ టీమ్.
ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చివరి దశకు చేరుకుందట. ఈ ఓటిటి వెర్షన్ లో 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారని తెలుస్తుంది. ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 26 నుండి గ్రాండ్ గా స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ సీజన్ ఆదివారం కాకుండా శనివారం ప్రారంభం కాబోతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి బిగ్ బాస్ తెలుగు ఓటిటి సీజన్ ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.