ఈ మధ్యకాలంలో తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన రియాలిటీ షో బిగ్ బాస్. విదేశాల్లో ‘బిగ్ బ్రదర్’ పేరుతో మొదలైన ఈ షో.. వివిధ దేశాలు మారుతూ బిగ్ బాస్ గా పాపులర్ అయింది. ఎన్నో ఏళ్లుగా ఇండియాలో కూడా బిగ్ బాస్ హిందీ వెర్షన్ రన్ అవుతోంది. ఇక ఇటీవల తెలుగు బిగ్ బాస్ అన్ని భాషల్లో కంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది.
ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా ముగించుకున్న బిగ్ బాస్ షోని ఓటిటి వెర్షన్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఓటిటి వెర్షన్ కి సంబంధించి ప్రకటనలతో పాటు సన్నాహాలు, కంటెస్టెంట్ల ఎంపిక కూడా మొదలైంది. తాజాగా బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనే వారు వీరేనంటూ పలువురి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటివరకు బిగ్ బాస్ షోని ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్ట్ చేస్తూ వచ్చారు. ఐదు సీజన్లలో కూడా మేల్ కంటెస్టెంట్స్ విజేతలుగా నిలిచారు. అలాగే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నాగ్ మాట్లాడుతూ.. నెక్స్ట్ సీజన్ కూడా తానే హోస్ట్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఓటిటి వెర్షన్ తెలుగు బిగ్ బాస్ షో.. డిస్నీ హాట్ స్టార్ లో 24 గంటలు ప్రసారం కాబోతుందని సమాచారం.ఈ షోకి సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. ఈసారి బిగ్ బాస్ ఓటిటి షోలోకి చాలామంది మాజీ కంటెస్టెంట్లను కూడా తీసుకురానున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ జాబితాలో ఆదర్శ్, తనీష్, అఖిల్ సార్థక్, అలీరెజా, హరితేజ, సూర్య వెబ్ సిరీస్ ఫేమ్ మౌనికా రెడ్డి, యూట్యూబర్ బంచిక్ బబ్లూ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ ఓటీటీ సీజన్ ఫిబ్రవరి 20 నుంచి అధికారికంగా ప్రారంభం కానుందట. దీనికి సంబంధించి ప్రోమోలు సిద్ధం చేస్తున్నారట. ఇక బిగ్ బాస్ ఓటీటీ షో.. 82 రోజులపాటు 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం కాబోతుంది. గతంలో ఈ షో రోజుకు 1- 2 గంటల మేర మాత్రమే ప్రసారమయ్యేది. తాజాగా ఈ సీజన్ లో 3, 4 స్థానాలలో నిలిచిన వారిని తర్వాత సీజన్ కు ప్రమోట్ చేయరని అంటున్నారు. కాబట్టి హిందీ వర్షన్ బిగ్ బాస్ ను తెలుగు ఓటిటి బ్రేక్ చేయనున్నట్లు చెబుతున్నారు. మరి బిగ్ బాస్ తెలుగు ఓటిటి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.