బిగ్ బాస్ ఓటిటి సీజన్ మొదలైన కొద్ది రోజులకే కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా తమ బలహీనతలను బయట పెడుతున్నారు. వాటిని బేస్ చేసుకొని మిగతా కంటెస్టెంట్స్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఓటిటిలో పాతవాళ్లు, కొత్తవాళ్లు ఉండేసరికి.. పాతవాళ్లను గత సీజన్స్ గురించి ప్రస్తావించి ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో హౌస్ లో ఎప్పుడూ డల్ గా కనిపించే అఖిల్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఇటీవలే ముమైత్ ఖాన్ – అఖిల్ మధ్య గొడవ జరిగిన టైంలో అషు రెడ్డి వచ్చి.. ఆ సీజన్ లో మోనాల్ ని, ఈ సీజన్ లో ఈమెను ఏడిపించడమే టార్గెట్ గా పెట్టుకున్నావా? అని అడిగేసింది. మధ్యలో మోనాల్ ప్రస్తావన వచ్చేసరికి అఖిల్ ముఖం డల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ ముమైత్ – అఖిల్ కలిసిపోయారు. తాజాగా అఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ మోనాల్ గురించి ముమైత్ దగ్గర ప్రస్తావించాడు.ముమైత్ తో మాట్లాడుతూ.. నేను హౌస్ లోకి రాకముందు పదే పదే కాల్ చేయకు అని మోనాల్ కి చెప్పాను. కానీ తాను వినలేదు. మళ్లీ మళ్లీ కాల్ చేసి మాట్లాడింది. నేను హౌస్ లో అడుగుపెట్టే చివరి నిమిషంలో కూడా మోనాల్ తోనే మాట్లాడాను. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. మోనాల్ ని చాలా మిస్ అవుతున్నాను.. అని తన బాధ బయటపెట్టాడు. దానికి ముమైత్ కూడా వత్తాసు పలికింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.