బిగ్ బాస్ అంటే గొడవలు గ్యారంటీ. లేకపోతే చూసే ప్రేక్షకులకు మజా ఏం ఉంటుంది! ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అయితే ప్రతి సీజన్ లో ఒకే గేమ్స్ పెడుతుంటారు. దీని వల్ల ఆడియెన్స్ కూడా బోరింగ్ గా ఫీలవుతుంటారు. ఈసారి మాత్రం బిగ్ బాస్ కొత్తగా ట్రై చేసినట్లు కనిపించింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అందుకు ఉదాహరణ. ఇకపోతే ఇదే టాస్కులో గొడవ పడటం కూడా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే… ఈసారి కెప్టెన్సీ టాస్కులో పాము-నిచ్చెన ఆట ఇచ్చారు. ఇందులో ఓ మూల ‘వేర్ హౌస్’ నిర్మించారు. ఇందులోని మట్టిని బయటకు తీసుకొచ్చి కొందరు నిచ్చెనలు, కొందరు పాములు నిర్మించాలి. ఇక ఈ టాస్కులో అందరూ కూడా బాగా ఆడారు. కీర్తి మాత్రం.. తన చేతి వేలు విరిగిపోవడంతో చాలావరకు ఇబ్బంది పడింది. పాముని కట్టేందుకు చాలా కష్టపడింది. ఇకపోతే పాము.. బుస్ మని సౌండ్ చేసినప్పుడు పాము బొమ్ములు కట్టిన వారిలో ఒకరు.. నిచ్చెనలు కట్టిన వారిలో మట్టిని లాక్కోవాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా రాజ్ ని సెలెక్ట్ చేసుకున్న కీర్తి.. నిచ్చెనలోని మట్టిని లాక్కోవడానికి తెగ కష్టపడింది. కానీ వీలుపడలేదు. ఇక దాని తర్వాత వాసంతి కట్టిన పాములోని మట్టి తీసుకునేందుకు శ్రీసత్య ప్రయత్నించింది. ఎలాగోలా మట్టిని తెచ్చుకుంది కానీ ఆమెని కదలనివ్వకుండా వాసంతి గట్టగా లాక్ చేసేసింది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కూడా కిందపడి మరీ కొట్టేసుకున్నట్లు కనిపించింది. ఇది జరిగిన కాసేపటికే కీర్తి ఏడ్చేసింది. ‘తాను వేలి నొప్పి వల్ల ఏడవటం లేదని, దీని వల్ల ఏమి చేయలేకపోతున్నాను’ అని తెగ బాధపడిపోయింది. ఇకపోతే గత ఎలిమినేషన్ లో గీతూ వెళ్లిపోవడంతో హౌసులో గొడవలు ఉండవని అందరూ అనుకున్నారు. ఆమె లేకపోయినా సరే హౌసులో ఎంటర్ టైన్ మెంట్ తగ్గదని ఈసారి కెప్టెన్సీ టాస్కుతో బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు.