బిగ్ బాస్ షో టాపిక్ వస్తే గొడవలు గురించి ఒకప్పుడు మాట్లాడుకునేవారు. ఇప్పుడు మాత్రం రొమాన్స్ ఎక్కువైంది అని ఒకటే డిస్కషన్. అదే పనిగా పెట్టుకుని కొందరు రెచ్చిపోతున్నారు. హగ్గులు కిస్సులకు అయితే అంతే లేదు. తాజాగా తెలుగులో ప్రసారమవుతున్న ఆరో సీజన్ లో కూడా ఇదే తంతు. ఓవైపు ఓటీటీలు, సినిమాలు, క్రికెట్ అంటూ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రేక్షకులకు అందుతోంది. వీటన్నింటిని దాటుకుని బిగ్ బాస్ షో చూడాలంటే ఈ మాత్రం ఉండాలనుకుంటున్నారో ఏమో గానీ తెగ రెచ్చిపోతున్నారు. అలా తాజాగా జరిగిన ఓ షాకింగ్ సంఘటన హౌసులోకి కంటెస్టెంట్లతోపాటు షో చూస్తున్న వ్యూయర్స్ కి కూడా షాకిచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చాలా ఏళ్ల క్రితం హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ షో మొదలైంది. చాలా వెంటనే అది క్లిక్ అయింది. దీంతో పలు దేశాల్లో ఈ షోని పోలిన షోలు పుట్టుకొచ్చాయి. మన దేశంలో ‘బిగ్ బాస్’ పేరుతో హిందీలో ప్రారంభించారు. ప్రస్తుతం 16వ సీజన్ ప్రసారమవుతోంది. తెలుగులో మాత్రం ఆరో సీజన్ జరుగుతోంది. ఇందులో మొత్తంగా 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. అందులో ఇప్పటికే ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఆర్జే సూర్య ఈ వారం వెళ్లిపోనున్నాడని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ లో జరిగే సీన్స్, ట్విస్టులు, రొమాన్స్, గొడవలు, అరుపులు.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఫుల్ మీల్స్ ఇస్తుంటాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా జరిగిన ఓ ఎపిసోడ్ లో భార్యభర్తలు మెరీనా-రోహిత్ చెలరేగిపోయారు. లైవ్ లోనే సరసాలాడేశారు.
ఇటీవల కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ చేపల చెరువు గేమ్ ఆడిపించాడు. ఈ టాస్క్ జరుగుతున్నంత సేపు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అయితే దీనికన్నా ఎక్కువగా రోహిత్ కు మెరీనా ముద్దులు పెట్టడం హాట్ టాపిక్ అయింది. మిగతా హౌస్ మేట్స్ చుట్టూ ఉన్న టైంలోనే మెరీనా, భర్త రోహిత్ కి సడన్ కి ముద్దుపెట్టింది. అందరూ చూస్తున్నారని తెలుసుకుని.. బెడ్ పై దుప్పటి కప్పుకొని మరీ ముద్దుల వర్షం కురిపించింది. ఇక చాలు అని రోహిత్ అనప్పటికీ.. మెరీనా రెచ్చిపోయింది. ఇదంతా దగ్గర నుంచి చూసిన వాసంతి, శ్రీహాన్, కీర్తి ముసిముసిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.