బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. కాస్త ట్రాక్‌లో పడినట్లు కనిపిస్తోంది. ఫ్యామిలీ వీక్ కావడంతో అంతా ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నారు. ఇంట్లో సభ్యుల బంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాలను చూసి ప్రేక్షకులు కూడా బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. ఆదిరెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్, శ్రీసత్య తల్లిదండ్రుల ఎంట్రీ, ఇనయా తల్లి ఆమెను క్షమించడం, కీర్తీ కోసం మహేశ్ రావడం, తల్లి చెప్పిందని రేవంత్ గడ్డం తీసేయడం ఇలా అన్నీ ఎంతో భావోద్వేగంగా సాగిపోయాయి. కీర్తీ భట్‌కి అయితే బిగ్ బాస్ వల్ల పెద్ద ఫ్యామిలీనే దొరికింది. కీర్తీ తల్లిదండ్రులు, రేవంత్ తల్లి నువ్వు మా కూతురివి.. నీకు ఎవరూ లేరని బాధ పడకు అంటూ భరోసానిచ్చారు.
ఇంక బిగ్ బాస్ జనరల్ అప్డేట్స్ విషయానికి వస్తే.. ఆఖరి కెప్టెన్‌గా ఇనయా సుల్తానా నిలిచింది. బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అవ్వాలి అనే తన కోరికను నెరవేర్చుకుంది. ఒంటరి పోరాటం చేస్తూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లాస్ట్ కెప్టెన్‌గా నిలిచింది. బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడూ తొలి కెప్టెన్, ఆఖరి కెప్టెన్ మాత్రమే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. అలా ఈ సీజన్లో తొలి కెప్టెన్ బాలాదిత్య కాగా.. ఆఖరి కెప్టెన్‌గా ఇనయా సుల్తానా అయ్యింది. పరిస్థితి ఏదైనా, అనుకున్నది చెప్పడం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేసింది. పైగా ఇంట్లో చాలా మంది ఆమెను టార్గెట్ చేయడం కూడా ఆమెకు బాగా కలిసొచ్చింది. అలా ఇనయా సుల్తానా బిగ్ బాస్ హిస్టరీలో కెప్టెన్ అయ్యింది.
ఇంక ఈవారం ఎలిమినేషన్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. అయితే ఈవారం నామినేషన్స్ లో ఇనయా సుల్తానా, శ్రీహాన్, రోహిత్ సాహ్ని, శ్రీసత్య, రాజ్, ఆదిరెడ్డి, ఫైమా ఉన్నారు. వీరిలో ఫ్యామిలీ ఎపిసోడ్ వల్ల ఇనయా సుల్తానా, శ్రీహాన్, శ్రీసత్యలకు గ్రాఫ్ బాగా పెరిగింది. ఈ ఎపిసోడ్ వల్లే ఓటింగ్ కూడా తారుమారైందని చెబుతున్నారు. నిజానికి శ్రీసత్య డేంజర్ జోన్లో ఉందని అనుకున్నారు. కానీ, ఆమె తల్లిదండ్రుల కోసం బాగా ఓటింగ్ చేశారు. దాంతో డేంజర్ జోన్లో ఉన్నవారి లెక్కలు తారుమారు అయ్యాయి. అనధికారిక ఓటింగ్ ప్రకారం.. ఫైమా, రాజ్, రోహిత్ డేంజర్ జోన్లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఫైమా పేరు బాగా వినిపిస్తోంది. ఒకవేళ ఫైమా కాకపోతే రోహిత్- రాజ్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి.. బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడు తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే.