బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మొదటి వారం మొత్తం ఎంతో ఉత్కంఠగా సాగింది. గొడవలు, టాస్కులతో హౌస్ మొత్తం హోరెత్తిపోయింది. ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదటి కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. టాస్కులో విజయం సాధించి బాలాదిత్య బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్‌గా నిలిచాడు. అతడిని ఫినోలెక్స్ పైప్స్ సింహాసనంపై కూర్చోబెట్టి కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. కెప్టెన్ అయిన వెంటనే బాలాదిత్య హౌస్‌కి కావాల్సిన సంస్కరణలు చేశాడు. నిజానికి పాత కెప్టెన్లు ఎవరూ పెట్టని ఒక కొత్త రూల్‌ని కూడా బాలాదిత్య తీసుకొచ్చాడు. అదేంటంటే.. హౌస్‌లో ఎవరూ ఎవరితో మిస్ బిహేవ్ చేయకూడదు, దురుసుగా మాట్లాడకూడదు. అలా ఎవరైనా చేస్తే కచ్చితంగా కెప్టెన్‌గా పనిష్మెంట్ ఇస్తానంటూ బాలాదిత్య ఆర్డర్స్ పాస్ చేశాడు.
నిజానికి అలాంటి రూల్ ఒకటి పెట్టినా బిగ్ బాస్ హౌస్‌లో పని చేయదు. కానీ, బాలాదిత్య ఒక మార్పు కోసం ప్రయత్నం చేయడం అభినందించ తగ్గ విషయమే. ఆ తర్వాత వరస్ట్ పర్ఫార్మెర్ ఎవరో చెప్పండి అంటూ బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులను కోరాడు. అప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పారు. మొదట రేవంత్, ఆదిరెడ్డి మధ్య కాస్త గట్టిగానే వాదన జరిగింది. రేవంత్ మొదట గీతూకి వేయాలనుకుని ఆమె పిరియడ్స్ లో ఉన్న సమయంలో అలా పంపలేను అంటూ తనకి తానే వేసుకుంటాడు. బిగ్ బాస్ అది కుదరదు అనడంతో.. ఆదిరెడ్డికి వేసి విషయం చెబుతాడు. అప్పుడు రిటర్న్‌లో ఆదిరెడ్డి కూడా రేవంత్‌కి వేసి మొదటి రోజు నుంచి జరిగిన అన్ని విషయాలను వెల్లడిస్తాడు.
ఈ వారం వరస్ట్ పర్పార్మర్ గా గీతూ రాయల్ నామినేట్ అయ్యి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమెకు పడిన ఓట్లలో కొంతమంది ఆమె గేమ్ స్ట్రాటజీ గురించి కూడా ప్రస్తావించారు. ఆమె గేమ్ సమయంలో పిట్‌లో ఉన్న నంబర్ కార్డులు తీసుకుని డ్రెస్సు లోపల పెట్టుకునే ప్రయత్నం చేసింది. అది తప్పని అలా చేస్తే ఎలా అంటూ అదే సమయంలో ప్రశ్నించారు. కానీ, ఆమె నా గేమ్ స్ట్రాటజీ అని చెప్పుకొచ్చింది. సాయంత్రం అదే ప్రశ్న అడగ్గా.. నేను ఒకవేళ టాస్కులో లోపల ఏమైనా పెట్టుకుంటే అబ్బాయిలు చెయ్యి పెట్టి తీసుకోవచ్చు. టాస్కులో అబ్బాయి, అమ్మాయి ఏం లేదు. లోపల చెయ్యి పెట్టి తీసుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే టాస్కులో అంతా ఒక్కటే అంటూ గీతూ క్లారిటీ ఇచ్చింది. గీతూ రాయల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.