బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. సీజన్ ప్రారంభం నుంచీ బాగా ఉత్కంఠగా సాగుతోంది. ఎందుకంటే మొదటిరోజు నుంచీ హౌస్‌లో గ్రూపులు, గొడవలు మొదలయ్యాయి. అసలు బిగ్ బాస్ ఫస్ట్ టాస్కుతోనే గ్రూపులు అనే కాన్సెప్ట్ ప్రారంభించాడు. మొదటివారంలో జరిగిన మేజర్ అప్‌డేట్స్ ఏంటంటే ఒకటి బాలాదిత్య కెప్టన్ కావడం, రెండు గీతూ రాయల్ వరస్ట్ పర్ఫార్మర్‌గా జైలుకెళ్లడం. బాలాదిత్య కెప్టెన్సీ కోసం పోరాడి విజయం సాధించాడు. అదే టాస్కులో పోరాడిన గీతూ రాయల్ వరస్ట్ పర్ఫార్మర్ అయ్యింది. అయితే వారం మొత్తం చూసి ఆమె బిహేవియర్ ని జడ్జ్ చేశామని చెప్పినా కూడా.. నిజానికి కెప్టెన్సీ టాస్కులో గీతూ రాయల్ ప్రవర్తనకే ఎక్కువ వరస్ట్ అని ఇచ్చారు.
అసలు విషయం ఏంటంటే.. కెప్టెన్సీ పోటీదారులుగా క్లాస్ నుంచి గీతూ, నేహా, ఆదిరెడ్డి సెలక్ట్ అయ్యారు. మాస్ కేటగిరీ నుంచి బిగ్ బాస్ ఒక ముగ్గురిని ఎంచుకోమన్నారు. వారిలో రోహిత్- మరీనా, బాలాదిత్య, ఆర్జే సూర్యాని ఎన్నుకున్నారు. మొత్తం ఆరుగురు కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. అక్వేరియంలో తాళాలు తీసుకుని పెట్టెలో ఉన్న నంబర్ ప్లేట్ చూసి పిట్‌లో ఉన్న కార్డులు తీసుకుని కారుకి నెంబర్ ప్లేట్ తయారు చేసుకోవాలి. ఆ టాస్కులో గీతూ రాయల్ ఆడుతూ పిట్‌లో ఉన్న అన్నీ కార్డులను చేత్తో పట్టుకుని తన దగ్గరే పెట్టుకుంది. అంతేకాకుండా ఆ కార్డులను డ్రెస్సు లోపల పెట్టుకునేందుకు ప్రయత్నించింది. అది చూసిన ఇంట్లోని వాళ్లు ఆమెను వారించారు. అలా చేయకంటూ గట్టిగా చెప్పారు.
ఆ తర్వాత అదే విషయంపై గొడవ కూడా జరిగింది. అయితే గీతూ రాయల్ ఉన్నది ఉన్నట్లు ముఖం మీద చెప్పేసింది. తాను గెలవడానికి మాత్రమే వచ్చానని అందుకు ఎలాగైనా ఆడతానంటూ సమర్ధించుకుంది. అంతేకాకుండా న్యాయం, అన్యాయం లాంటివి పట్టించుకోనని గెలవడానికి ఎలాగైనా ఆడతానంటూ కుండ బద్దలు కొట్టేసింది. అయితే ఆమె మాటలను మళ్లీ తప్పుబట్టారు. డ్రెస్సులో కార్డులు పెట్టుకుంటే అబ్బాయిలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అందుకు గీతూ.. “చేయి పెట్టి తీసుకోవడమే. టాస్కులో అందరూ ఒక్కటే అబ్బాయి, అమ్మాయి అనేం లేదు. నేను నిజంగా లోపల దాచుకుంటే వాళ్లు చేయి పెట్టి తీసుకున్నా తప్పుకాదు. షర్ట్ లోపల చేయి పెట్టి తీసుకున్నా నాకు నో ప్రాబ్లమ్. దానిని తప్పుబట్టను” అంటూ చెప్పుకొచ్చింది.
గీతూ రాయల్ మాటలు అక్కడి వారికి ప్రేక్షకులు తప్పుగా అనిపించినా కూడా ఆమె చాలా బోల్డ్ గా మాట్లాడింది. ఏంటంటే.. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ టాస్కుల్లో సభ్యులు లోపల వస్తువులు దాచుకుని టాస్క్ ఆడటం చూస్తూనే ఉన్నాం. ఏ ఒక్క సీజన్లోనూ అలా జరగకుండా లేదు. అసలు ముట్టుకోకపోయినా కూడా నన్ను అక్కడ టచ్ చేశాడంటూ గగ్గోలు పెట్టిన వాళ్లను కూడా చూశాం. కానీ, అక్కడ పెట్టుకుంటే ముట్టుకున్నా తప్పులేదు అంటూ కామెంట్ చేయడం మొదటిసారి చూశారు. చాలా మంది అది బరితెగింపు అంటున్నా.. ఆమె స్ట్రాటజీని ఆమె సమర్ధించుకుంది. ఇప్పటికి చాలాసార్లు ఆ విషయంలో బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు జరిగాయి. కానీ, ఎవరూ ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు. గీతూ రాయల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.